ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ సీఈవో రాజీవ్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ మొదలై, చివరి విడత జూన్ 1న ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా వుండగా నాలుగో విడతలో మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలుంటాయి. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.
ఏపీ ఎన్నికల విషయానికి వస్తే… ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన వుంటుంది. ఏప్రిల్ 29వ తేదీ వరకూ ఉపసంహరణ గడువు వుంటుంది. అనంతం మే 13న ఎన్నికలు రాష్ట్రమంతా ఒకేసారి జరుగుతాయి. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది