టిల్లు ఫ్యామిలీ ఓకె.. కల్కి?

ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు. మే నెల 13న ఎన్నికలు. ఇది కాస్త షాక్ నే. Advertisement రెండు నెలల ముందు…

ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూలు వచ్చేసింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఏప్రిల్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు. మే నెల 13న ఎన్నికలు. ఇది కాస్త షాక్ నే.

రెండు నెలల ముందు నుంచే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి పార్టీలు అన్నీ, ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే నానా హడావుడి జరిగిపోయింది. పొత్తులు ఫిక్స్ అయిపోయాయి. ఎవరు పోటీ చేస్తారో కూడా తేలిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నికలు మాత్రం దాదాపు రెండు నెలల దూరంలోకి వెళ్లిపోయాయి. సుమారు 60 రోజులు ప్రచారానికి సమయం వుంది.

నామినేషన్లు, విత్ డ్రాయల్స్, బుజ్జగింపులు, బేరసారాలు అన్నింటికీ బోలెడు సమయం వుంది. పార్టీలకు ఇది కాస్త హ్యాపీనే. కానీ సినిమా ప్రేక్షకులకు మాత్రం బోర్. దాదాపు ఫిబ్రవరి నుంచి సరైన సినిమా థియేటర్ లోకి రాలేదు. మార్చి కూడా అదే పరిస్థితి.

ఈ నెలాఖరులో టిల్లు స్క్వేర్ వస్తోంది. ఫస్ట్ వీక్ లో ఫ్యామిలీస్టార్. ఈ రెండు సినిమాలకు ఎన్నికల దెబ్బ పడుతుంది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆ రెండూ గట్టెక్కేసాయి. అసలే సినిమాలు లేవు. పైగా ఎన్నికలు చాలా దూరం వున్నాయి. హాలీడేస్ వచ్చేసాయి. అందువల్ల ఏమాత్రం బాగున్నా ఈ రెండు సినిమాలు కలెక్షన్లు దున్నేసుకుంటాయి.

కానీ సమస్య మాత్రం ప్రభాస్ ప్రాజెక్ట్ కల్కి కి మాత్రమే. మే 9న విడుదల అనుకున్నారు. 13న ఎన్నికలు. పీక్ టైమ్. అందువల్ల కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సి వుంటుంది. జూన్ లోనే విడుదలకు అవకాశం వుండొచ్చు.