‘టీ’ చల్లారిపోయేలా వుంది!

కష్టపడి, ఓ కాన్సెప్ట్‌ను పట్టుకుని, టీ టైమ్ అంటూ చైన్ టీ దుకాణాలకు అంకురార్పణ పలికి, సక్సెస్ సాధించారు ఉదయ్. తెలుగు నాట చైన్ టీ దుకాణాలకు ఆద్యుడిగా ఆయననే పేర్కొనాలి. అనేక మందికి…

కష్టపడి, ఓ కాన్సెప్ట్‌ను పట్టుకుని, టీ టైమ్ అంటూ చైన్ టీ దుకాణాలకు అంకురార్పణ పలికి, సక్సెస్ సాధించారు ఉదయ్. తెలుగు నాట చైన్ టీ దుకాణాలకు ఆద్యుడిగా ఆయననే పేర్కొనాలి. అనేక మందికి టీ దుకాణాల ద్వారా ఉపాధి దొరికింది. అంత వరకు బాగనే వుంది. కానీ అలా సంపాదించిన డబ్బు ఇప్పుడు రాజకీయాల్లో ఖర్చు చేసేలా కనిపిస్తోంది పరిస్థితి.

టీటైమ్ ఉదయ్ జనసేన రాజకీయాల్లో కీలకంగా వున్నారు. పవన్ కోసం ఏకంగా వారాహి రథాన్ని తన ఖర్చుతో ఉదయ్ రెడీ చేసారు. దానికి ప్రతి ఫలంగా కావచ్చు, మరెలాగైనా కావచ్చు, రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడానికి మార్గం సుగమం అయింది. కానీ ఇప్పుడు గెలవడం కన్నా, అసలు ఎన్నికల్లో పాల్గొనడం అంటే అంత వీజీ కాదు. పిఠాపురం ఎమ్మెల్యేగా నిల్చున్నా, కాకినాడ ఎంపీగా నిల్చున్నా కోట్లతో వ్యవహారం. ఎమ్మెల్యే అంటే కనీసం ముఫై కోట్లు, ఎంపీ అంటే నలభై నుంచి యాభై కోట్లు.

టీ టైమ్ ఉదయ్ గా బాగానే సంపాదించి వుండొచ్చు ఫ్రాంచైజీ ల మీద. కానీ అది ఇప్పుడు ఈ ఎన్నికలకు సరిపోతుందా? పోటీ చేసేది జనసేన తరపున. అందువల్ల అట్నుంచి పార్టీ సాయం వుంటుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. అందువల్ల స్వంత సొమ్ములు ఖర్చుచేయాల్సిందే. గెలిస్తే ఎలా వుంటుంది.. ఎంత సంపాదించవచ్చు అన్నది తరువాత సంగతి. ప్రస్తుతానికి టీ టైమ్ మీద సంపాదించినది ఎన్నికల్లో పోయాల్సిందే.

పైగా మరో సమస్య కూడా వుంది. ఉదయ్ కు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓకె. అలా కాకుండా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీకి దిగి, ఉదయ్ కాకినాడ ఎంపీ అంటే మరింత ఖర్చు వుంటుంది. పవన్ కళ్యాణ్ ఖర్చు కూడా అంతో ఇంతో ఉదయ్ నే పెట్టుకోవాలి. వారాహి కొని ఇచ్చినట్లుగానే. అదృష్టం బాగుండి గెలిస్తే ఏ సమస్యా లేదు.. అలా కాకుంటేనే మొత్తం టీ చల్లారిపోతుంది.