భగత్ సింగ్ ‘గ్లాసు’పై ఎన్నికల సంఘం దృష్టి

సరిగ్గా ఎన్నికల వేళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఆఘమేఘాల మీద ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమా ప్రచారం ముసుగులో ఎన్నికల ప్రచారం చేశారు. పవన్ పార్టీ సింబల్ గాజు గ్లాస్…

సరిగ్గా ఎన్నికల వేళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఆఘమేఘాల మీద ఓ వీడియో రిలీజ్ చేశారు. సినిమా ప్రచారం ముసుగులో ఎన్నికల ప్రచారం చేశారు. పవన్ పార్టీ సింబల్ గాజు గ్లాస్ చుట్టూ వీడియోను తిప్పారు. పవన్ తో డైలాగ్స్ కూడా చెప్పించారు.

వీడియో బాగా వైరల్ అయింది. అటుఇటు తిరిగి ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అయితే కమిషన్ సభ్యులెవ్వరూ ఇంకా ఆ వీడియో చూడలేదంట.

గాజు గ్లాసు చూపించి పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్ కిందకు వస్తుందని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం. ఏ మాధ్యమం ద్వారా అయినా రాజకీయ ప్రచారం చేసుకోవచ్చని.. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుందని, ముందుగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపింది. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను ఇంకా చూడలేదని, చూసిన తర్వాత రాజకీయ ప్రచారం అని భావిస్తే, కచ్చితంగా నిర్మాతలకు నోటీసులిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఉస్తాద్ భగత్ సింగ్ వీడియోపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ ఈ 2 రోజుల్లో ఫిర్యాదు రాకపోయినా, స్వచ్ఛందంగా తాము వీడియో చూసి నిర్ణయం తీసుకుంటామని కమిషన్ తెలిపింది. వీడియోలో చూపించిన సన్నివేశాలు, డైలాగులు ఎన్నికల ప్రచారం కిందకు వస్తే తప్పకుండా నిర్మాతలకు నోటీసులిస్తామని ప్రకటించింది.

టేబుల్, సైకిల్, ఫ్యాన్, గ్లాసు లాంటివి మనం రెగ్యులర్ గా వాడుతుంటామని.. అలా అని వాటిని ప్రతిసారి పబ్లిసిటీ కింద చూడకూడదని తెలిపిన ఎన్నికల సంఘం.. ఏ అంశాన్నయినా కేస్-టు-కేస్ పరిశీలిస్తామని.. అన్నింటినీ ఒకే గాటన కట్టిపడేయమని తేల్చిచెప్పింది. సో.. త్వరలోనే ఈ వీడియోపై ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.