తారలు ధరించే దుస్తులు కొన్ని చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ వాటి రేటు తెలిసినప్పుడు మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. మొన్నటికిమొన్న అయోధ్య రాముడ్ని దర్శించుకున్న సమయంలో ప్రియాంక చోప్రా కట్టిన సాధారణ పసుపు రంగు చీర ధర 63వేల రూపాయలకు పైగా ఉందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. అలాంటిదే ఈ గౌన్ కూడా.
రెగ్యులర్ గా ఫొటోషూట్స్ లో పాల్గొనే జాన్వికపూర్, తాజాగా మరోసారి ఫొటోలకు పోజులిచ్చింది. ఈసారి ఆమె ఓ బాడీ ఫిట్ గౌన్ ధరించింది. నయీమ్ ఖాన్ డిజైన్ ఈ గౌన్ చూడ్డానికి చాలా సింపుల్ గా అందంగా ఉంది. కానీ దీని రేటు మాత్రం అక్షరాలా 4 లక్షల 23వేల 300 రూపాయలు.
ఇంత రేటు పెట్టి ఈ డిజైనరీ గౌన్ ఎవరైనా కొంటారా అనే అనుమానం కలుగుతుంది. కానీ అలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఆల్రెడీ డిజైన్ చేసిన గౌన్స్ అయిపోయాయి. కొత్త ఆర్డర్లు కూడా వచ్చాయి. జాన్వి ధరించిన తర్వాత ఈ గౌన్ కు డిమాండ్ మరింత పెరిగింది. ఈ గౌన్ తో పాటు జాన్వి ధరించిన యాక్ససిరీస్ కూడా కావాలంటే అదనంగా మరో లక్ష రూపాయలు పెట్టాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సౌత్ సినిమాలతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ సరనస దేవర సినిమా చేస్తోంది. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది.