దర్శకుడు బాబీ నిర్మాతగా మారుతున్నారు. చిన్న సినిమాలు, కాన్సెప్ట్ సినిమాలు చేసే ఆలోచనతో ఓ బ్యానర్ ను స్టార్ట్ చేస్తున్నారు. దానికి ఇది ఫస్ట్ సినిమా.
నిర్మాణ నిర్వహణ కోన వెంకట్ చూసుకుంటారు. తొలి సినిమాను ఉగాది నాడు ప్రారంభిస్తున్నారు శ్రీవిష్ణు హీరో. ప్రారంభోత్సవ వేడుకకు వివి వినాయక్ తో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. కోనవెంకట్, బాబీ దగ్గర వున్న ఆఫ్ బీట్ ఐడియాలు లేదా కొత్త తరహా ఐడియాలను ఈ కొత్త బ్యానర్ మీద తెరకెక్కిస్తారు.
దర్శకులు, హీరోలు నిర్మాతలుగా మారడం, చిన్న, మీడియం సినిమాలు అందించడం అన్నది టాలీవుడ్ లో కామన్. బాబీ కూడా అదే బాట పడుతున్నారు. బాబీ ఇప్పుడు మంచి కమర్షియల్ డైరక్టర్ స్టేటస్ లో వున్నారు. వాల్తేర్ వీరయ్య సినిమా పెద్ద హిట్ కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి బాబీ మీద పడింది. బాలయ్య-సితార కాంబినేషన్ లో మంచి కమర్షియల్ సినిమా నిర్మాణంలో వుంది.
బాబీ రెమ్యూనిరేషన్ ఇప్పుడు 15 నుంచి 20 కోట్ల మేరకు వుందని ఇండస్ట్రీ టాక్. అందువల్ల చిన్న సినిమాలతో నిర్మాతగా మారడం అన్నది కష్టం కాదు. దీని వల్ల ఇండస్ట్రీకి మరో కొత్త బ్యానర్ వచ్చినట్లే.