ఇక మిగిలింది త్రివిక్రమ్ ఓన్లీ

తెలుగు నాట టాప్ డైరక్టర్లు అంతా పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగిపోయారు. వందల కోట్ల బరువైన సినిమాలు తలకెత్తుకుంటున్నారు. జాతీయ స్ధాయిలో పేరు మారుమోగేలా చేసుకుంటున్నారు. టాప్ లైన్ లో వున్న వారంతా…

తెలుగు నాట టాప్ డైరక్టర్లు అంతా పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగిపోయారు. వందల కోట్ల బరువైన సినిమాలు తలకెత్తుకుంటున్నారు. జాతీయ స్ధాయిలో పేరు మారుమోగేలా చేసుకుంటున్నారు. టాప్ లైన్ లో వున్న వారంతా ఈ రేంజ్ కు మెల్లగా వెళ్లిపోయారు. వెళ్లిపోతున్నారు. ఒక్క త్రివిక్రమ్ తప్ప.

ఫ్యామిలీ డైరక్టర్ ఆయన. ఆయన కథలు మన కుటుంబాల చుట్టూ తిరుగుతుంటాయి. తిరిగిన కథలే మళ్లీ మళ్లీ తిరుగుతుంటాయి. అరవింద సమేత లాంటి ఒక్కటి మినహాయింపు.

ఈ తరహా కథలతో పాన్ ఇండియా లెవెల్ సినిమాలకు ఎదగడం కష్టం. పైగా డైలాగ్ బేస్డ్ ఫన్, ఫ్యామిలీ బేస్డ్ ఎమోషన్లు పాన్ ఇండియా లెవెల్ కు సరిపోవు. పెద్ద కాన్వాస్, అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలు, ఇలా చాలా కావాలి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లకు హిందీ బెల్ట్ లో వచ్చే ఇమేజ్ వేరు. అది సాధించాలంటే పౌరాణికాలు సరిపోవు. భారతమో, రామాయణమో, భక్త ప్రహ్లాదనో తీసుకుని, భారీ లెవెల్ పౌరాణికం తీసి, పాన్ ఇండియాకు వెళ్దామని అనుకున్నా, రాంగ్ ఐడియానే అవుతుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఇలాంటి ప్రయత్నం బన్నీ కోసం చేయబోతున్నారని టాక్ వుంది. పుష్ప 2 తరువాత బన్నీ- త్రివిక్రమ్ కనుక సినిమా చేస్తే అది కచ్చితంగా అదే రేంజ్ సినిమా అవుతుంది. అప్పుడు కానీ టాప్ లైన్ డైరక్టర్లలో మిగిలిన త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లడం సాధ్యం కాదు. అందువల్ల సరైన స్టెప్ వేస్తే తప్ప, త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లలేరు.