కల్కి వైపు చూస్తున్న బయ్యర్లు

కల్కి సినిమా భవిష్యత్ మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇంత పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయింది. త్వరలో రాబోయే దేవర, పుష్ప, గేమ్ ఛేంజర్ అన్నీ కూడా భారీ సినిమాలే. పుష్ప…

కల్కి సినిమా భవిష్యత్ మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇంత పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయింది. త్వరలో రాబోయే దేవర, పుష్ప, గేమ్ ఛేంజర్ అన్నీ కూడా భారీ సినిమాలే. పుష్ప ఆంధ్ర ఏరియా 90 కోట్లు, దేవర 55 కోట్లు ఇలా వున్నాయి లెక్కలు. భవిష్యత్ లో పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఇక ఇలాగే వుంటాయి. ధైర్యం తెచ్చుకోవాల్సింది బయ్యర్లే. ఇప్పటి వరకు బయ్యర్లు రిస్క్ చేసింది పుష్ప విషయంలోనే. అక్కడ నష్టపోయినా నిర్మాతలు సర్దు బాటు చేసుకున్నారు.

కన్నడ భారీ సినిమాలు కేజిఎఫ్, సలార్ లతో సమస్య లేకపోయింది. ఎందుకంటే అడ్వాన్స్ ల మీద పంపిణీ జరిగింది ఎక్కువగా. ఇప్పుడు ఈ కల్కి కూడా అన్ని చోట్లా రిటర్నబుల్ అడ్వాన్స్ లే. పుష్ప 2 అమ్ముదాం అంటే బయ్యర్లు ముందు వెనుక ఆడుతున్నారు. ఆంధ్ర 90 కోట్ల రేంజ్ అందుకుంటుందా అన్న అనుమానాలు వున్నాయి.

టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ కు ముందు వెనుక అనే లెక్కలు వున్నాయి. నాన్ బాహుబలి రికార్డులు అనే మాటలు వున్నాయి. కానీ ఇటీవల మరీ భారీ సినిమాలు పెరిగాయి. కానీ ఏడాది కాలంగా మరీ ఇంత భారీ సినిమాల కొనుగోలు, రిస్క్ అన్నది మాత్రం లేదు. నాన్ రిస్క్ తో పంపిణీ చేయడంతోనే సరిపోతోంది.

లేటెస్ట్ రేట్లు, ఫుట్ పాల్, ట్రెండ్ ప్రకారం ఏ ఏరియాలో ఎలా ఆడితే, ఏ మేరకు వసూళ్లు వస్తాయి అన్నది ఓ క్లారిటీ వస్తుంది. అందువల్ల ఇకపై వచ్చే పెద్ద సినిమాలు కొనడానికి కాస్త ధైర్యంగా ముందుకు వస్తారు. సినిమా హిట్ రేంజ్, రేట్లు ఇవన్నీ ఒక లెక్కకు అందుతాయి. దీనిని బట్టి ఇకపై పెట్టుబడులు కూడా ప్రభావితం అవుతాయి.

అందుకే కల్కి సినిమా మార్కెట్, బిజినెస్ లెక్కల మీద, కలెక్షన్ల మీద బయ్యర్లు అంతా దృష్టి పెట్టి వున్నారు.