స్టార్ సింగర్ కు అరుదైన వ్యాధి

ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. 90ల్లో తిరుగులేని సింగర్ గా పేరు తెచ్చుకున్న అల్కా, అరుదైన వినికిడి లోపానికి గురయ్యారు. వైరల్ ఎటాక్ కారణంగా ఆమె ఈ అనారోగ్యం…

ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. 90ల్లో తిరుగులేని సింగర్ గా పేరు తెచ్చుకున్న అల్కా, అరుదైన వినికిడి లోపానికి గురయ్యారు. వైరల్ ఎటాక్ కారణంగా ఆమె ఈ అనారోగ్యం బారిన పడ్డారు.

ఈ అరుదైన వినికిడి లోపం విషయాన్ని అల్కా స్వయంగా బయటపెట్టారు. భారీగా శబ్దాలు వినడం, ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆమె వెల్లడించారు. లోపలి చెవి లేదా నరాల నుండి ధ్వనిని ప్రసారం చేసే నాడీ మార్గాలు దెబ్బతినడం వల్ల ఈ వినికిడి లోపం ఏర్పడుతుంది.

కొన్ని సార్లు ధ్వని బిగ్గరగా వినిపిస్తుంది, మరికొన్నిసార్లు అస్సలు వినిపించదు. అదే ఈ సమస్య. ఈ ఆకస్మిక ఇంద్రియ లోపానికి 2-3 రోజుల్లోగా ట్రీట్ మెంట్ ప్రారంభించాలి, లేదంటే శాశ్వత వినికిడిలోపం ఏర్పడే ప్రమాదం ఉంది.

తనకు ఈ సమస్య ఉండడం వల్లనే ఈ మధ్య కొన్ని ముఖ్యమైన ఫంక్షన్లకు హాజరుకాలేకపోయానని, దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు అల్కా యాగ్నిక్. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడడం, కీమోథెరపీ, మొనింజైటిస్, గుండెపోటు లాంటి సమస్యల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది.

తన పరిస్థితిని ఆల్కా యాగ్నిక్ బయటపెట్టడంతో, ఆమెపై నెటిజన్లు సానుభూతి కురిపిస్తున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆల్కా యాగ్నిక్ వయసు 58 ఏళ్లు. ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సింగర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. వెయ్యికి పైగా సినిమాలకు ఆమె వర్క్ చేశారు. 25కి పైగా భాషల్లో 21వేల పాటలు రికార్డ్ చేశారు. ఇటీవల, ఆమె దిల్జిత్ దోసాంజ్ చేసిన నటించిన అమర్ సింగ్ చమ్కిలా పాట పాడారు. కరీనా కపూర్ నటించిన క్రూ సినిమాలో కూడా ఓ పాట పాడారు.