దేవర.. కమిషన్లే.. 50 కోట్లు

ఈ ఏడాది ఏమిటో ఇలా వుంది. సరైన సినిమాలు సరైన టైమ్ లో రావడం లేదు. ప్రతీదీ వాయిదా.. వాయిదా… పవన్ కళ్యాణ్ ఓజి వచ్చే ఏడాదికి వెళ్లిపోయినట్లే. చరణ్ గేమ్ ఛేంజర్ అనే…

ఈ ఏడాది ఏమిటో ఇలా వుంది. సరైన సినిమాలు సరైన టైమ్ లో రావడం లేదు. ప్రతీదీ వాయిదా.. వాయిదా… పవన్ కళ్యాణ్ ఓజి వచ్చే ఏడాదికి వెళ్లిపోయినట్లే. చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చినట్లు. పుష్ప 2 మళ్లీ బాగా వెనక్కు వెళ్లిపోయింది. గత ఏడాది డిసెంబర్ లో రావాల్సిన సినిమా ఈ ఏడాది డిసెంబర్ కు డేట్ పడింది.

ఇక మిగిలింది ప్రభాస్ కల్కి.. ఎన్టీఆర్ దేవర. కల్కి సినిమా జూన్ 27.. దేవర సినిమా సెప్టెంబర్. అంటే మూడు నెలలు గ్యాప్. భారీ సినిమా రావడానికి. ఈ మధ్యలో మీడియం సినిమాలు ఎలాగూ వుంటాయి. కానీ భారీ మాస్ సినిమా అయితే లేదు. అందుకే దేవర బిజినెస్ కు కాస్త పోటీ వచ్చింది.

ఈ సినిమా ను 110 నుంచి 115 కోట్ల రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు సితార నాగవంశీ తీసుకున్నారు. ఇప్పుడు కిందకు డిస్ట్రిబ్యూషన్ కు అమ్మడం మొదలుపెట్టారు. ఆంధ్ర 50 నుంచి 55 కోట్లు చెబుతున్నారు. నైజాం 45 కోట్లకు, సీడెడ్ 23 కోట్లకు ఇస్తున్నారు. మొదట్లో ఈ రేట్లకు ఎవరు వస్తారో అనుకున్నారు కానీ, ఎప్పుడైతే పుష్ప వాయిదా పడడంతో, ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు బాగానే ముందుకు వస్తున్నారు. సీడెడ్ లాంటి చోట్ల పోటీ పడుతున్నారు.

ఎందుకిలా?

నిజానికి 115 కోట్లకు పైగా మొత్తానికి నిర్మాత సింగిల్ పాయింట్ లో సేల్ చేసారు. అది కూడా నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కు. ఇక్కడ ఓ లాభం వుంది. ఓ నష్టం వుంది. ఇలా సింగిల్ పాయింట్ లో ఇవ్వడం వల్ల చాలా తలనొప్పులు తగ్గుతాయి. కానీ కింద బయ్యర్ కు కమిషన్ వెళ్తుంది. సింగిల్ పాయింట్ లో కొన్న వారికి కమిషన్ వెళ్తుంది. ఇంకా ఖర్చులు, జిఎస్టీలు.. అందువల్ల ఈ రేటు మీద మరి ఓవర్ ఫ్లోస్ అన్నది మరిచిపోవాల్సి వుంటుంది.

అదే నిర్మాత నేరుగా, విడివిడిగా కిందకు అమ్మి వుంటే ఒక 20 శాతం కమిషన్ తో పోతుంది. ఇప్పుడు రెండు.. ఇరవై శాతం కమిషన్లు కట్ అవుతాయి. అంటే దాదాపు 25 కోట్లకు పైగా అదనంగా కమిషన్ పొతుంది. మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే ఇంత రేట్ల మీద ఇక ఓవర్ ఫ్లోస్ ఏమి వస్తాయి. పైగా విడివివిగా అమ్మే తలనొప్పులు ఎందుకు అన్న మాట వినిపిస్తుంది. కానీ కోరి 25 కోట్లు వదలుకుంటారా అన్న ప్రశ్న అలాగే వుంటుంది.

ఇదిలా వుంటే 115 కోట్లకు కాస్త అటు ఇటుగా కొని, కిందకు విక్రయించడం వల్ల సితార నాగవంశీకి కూడా లాభం, రిస్క్ రెండూ వున్నాయి. సినిమా సక్సెస్ అయితే పాతిక కోట్ల వరకు కమిషన్ వస్తుంది. సినిమా నిర్మించకుండా కేవలం రిస్క్ చేసి తీసుకుని కిందకు అమ్మడం వల్ల పాతక కోట్ల వరకు వస్తుంది.

లేదూ తేడా వస్తే, భవిష్యత్ లో సితార సినిమాలకు కాస్త రేట్లు తగ్గించుకుని బయ్యర్లకు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది.