కల్కి… రెండు పాటలు

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమా కల్కి. అశ్వనీదత్ అయిదు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన సినిమా. అమితాబ్, కమల్, దీపిక లాంటి భారీ స్టార్ కాస్ట్ వున్న ఈ ఫ్యూచర్…

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమా కల్కి. అశ్వనీదత్ అయిదు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన సినిమా. అమితాబ్, కమల్, దీపిక లాంటి భారీ స్టార్ కాస్ట్ వున్న ఈ ఫ్యూచర్ ఫిల్మ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.

భూమి మీద దారుణ పరిస్థితులు, మరో లోకం, ఇలా చాలా వున్నాయి ఇందులో. అయితే ఈ సినిమాలో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. అందువల్ల ఒక్క పాటతోనే సరిపెట్టారు. ఇంకా ఆ పాటను విడుదల చేయలేదు.

అయితే మరీ ఒక్క పాట అంటే బాగోదు అనుకున్నారో, లేదా సినిమా టైటిల్స్ వచ్చే నేపథ్యంలో ఓ పాట వుంటే బాగుంటుంది అనుకున్నారో, మొత్తానికి మరో పాట జోడిస్తున్నారని తెెలిసింది. ఈ నెల 27న సినిమా విడుదలవుతుంది. ఈ లోగానే ఆ పాటను జోడిస్తారు. ఇంత తక్కువ టైమ్ లో పాట అంటే బహుశా విజువల్స్ అవసరం లేదేమో అని అనుకోవాల్సిందే. అంటే టైటిల్స్ మీద ఈ సాంగ్ ను వేస్తారని అనుకోవాలేమో?

ఇప్పటికే ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ మొదలుపెట్టారు. త్వరలో ముంబాయి, చెన్నయ్ ల్లో ఈవెంట్లు చేయబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో భారీగా చేసే ఆలోచన చేస్తున్నారు. అమరావతిలో చేసే తొలి భారీ సినిమా భారీ ఫంక్షన్ ఇదే.