ఎవరికీ అంతు పట్టని మహిళా ఓటు

ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్ నాడు సాయంత్రానికి ఓ అంచనా వచ్చేస్తుంది. కానీ ఈసారి దేశం కూటమి, వైకాపా రెండూ ఎవరి ధీమాతో వారు వున్నారు. Advertisement ఇది వట్టి మేకపోతు గాంభీర్యమా? లేక…

ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్ నాడు సాయంత్రానికి ఓ అంచనా వచ్చేస్తుంది. కానీ ఈసారి దేశం కూటమి, వైకాపా రెండూ ఎవరి ధీమాతో వారు వున్నారు.

ఇది వట్టి మేకపోతు గాంభీర్యమా? లేక నిజంగానే ధీమాగా వున్నారా? అన్న ప్రశ్న వేసుకుంటే నిజంగానే ధీమాగా వున్నారు. ఎందుకు రెండు వైపులా ధీమా అంటే సింగిల్ ఆన్సర్. మహిళల ఓట్లు ఈసారి ఎవరికి పోల్ అయ్యాయి అన్నది సస్సెన్స్ గా వుంది.

పథకాలు అందుకున్నారు కనుక, మగవారు పార్టీల వారిగా చీలిపోయినా, మహిళలు మాత్రం తమకే మద్దతుగా నిలిచారని వైకాపా జనాలు బలంగా నమ్ముతున్నారు. అందువల్ల గెలుపు తమనే వరిస్తుందని వారు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం మహిళల ఓటు ఎటు పడిందో తెలిస్తే తప్ప మెజారిటీ తెలియదని, టఫ్ ఫైట్ విజయంగా మారుతుందో లేదో తెలియదని అంగీకరిస్తున్నారు.

అదే సమయంలో తెలుగుదేశం కూటమి మహిళల ఓటు ఈసారి తమకే పడిందని భావిస్తోంది. మహిళలు ఫ్రీబస్ పథకం, నెల నెలా డబ్బులు ఇస్తామన్న హామీ ఇలాంటివి అన్నీ తమకు మహిళల ఓట్లు పడతాయని భావిస్తోంది.

ఇలా మొత్తం మీద మహిళల ఓట్లు ఎటు పడతాయి అన్నది తేలక ఆంధ్రలో ఫలితాలు తేలడం లేదు. అందువల్లే  పోటీ చేసిన 350 మంది ప్రధాన అభ్యర్ధుల ఆశలు సజీవంగా వున్నాయి. పోస్ట్ పోలింగ్ ఫలితాలు అందడం లేదు ఎవరికీ సరిగ్గా.