కొన్ని పుకార్లు వింటే భలే ఫన్నీగా ఉంటాయి. నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఇది అలాంటి పుకారే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. త్వరలోనే ఇండియన్-2 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇండియన్-3 షూట్ కూడా చాలా మేరకు పూర్తిచేసిన సంగతి కూడా తెలిసిందే.
తాజా ఊహాగానం ఏంటంటే.. ఇండియన్-2 సినిమా చివర్లో ఇండియన్-3 ట్రయిలర్ ను ప్రదర్శిస్తారట. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు మేటర్ ఉంది. ట్రయిలర్ లో ఇండియన్-3 విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేస్తారట. ఇదే పెద్ద కామెడీగా తోస్తోంది చాలామందికి.
శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నెలల తరబడి చెక్కుతూనే ఉంటాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గేమ్ ఛేంజర్. చాన్నాళ్లుగా ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకా సెట్స్ పైనే ఉంది.
ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తూ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం హాస్యాస్పదంగా ఉంటుంది. గేమ్ ఛేంజర్ డేట్ ఇప్పటివరకు రాలేదు. ఇండియన్-2 డేట్ ఇచ్చి అంతలోనే వాయిదా మంత్రం జపించారు.
చేతిలో ఉన్న సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఇండియన్-3కి రిలీజ్ డేట్ ఇస్తారట. ఇంతకంటే జోక్ ఉంటుందా..?