బద్ధకించిన విశాఖ

విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది.…

విశాఖ సిటీ ఎప్పుడూ పోలింగ్ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం చూపించదు. అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 63 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. అది ఈసారి ఇంకా తగ్గినట్లుగా పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్ధం అవుతోంది.

ఈసారి కూడా చూస్తే 57.42 శాతం ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే గతసారి కంటే తక్కువ అనే అంటున్నారు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఇంకా క్యూ లైన్లు ఉన్నాయి కాబట్టి విశాఖ జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. కానీ సిటీలో మాత్రం తక్కువ శాతమే నమోదు అవుతోంది.

మూడేళ్ల క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఇదే తీరు కనిపించింది. అప్పుడు గట్టిగా యాభై శాతం కూడా పోలింగ్ సాగలేదు. సిటీ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లను తీసుకుంటే ఉన్నంతలో విశాఖ తూర్పు నియోజకవర్గమే ఎక్కువగా పోల్ అయింది. అక్కడ 60.53 శాతం పోలింగ్ ఉంటే విశాఖ ఉత్తరంలో 54 శాతం, విశాఖ దక్షిణంలో 53 శాతం, విశాఖ పశ్చిమలో 56 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.

దాంతో విశాఖ సిటీ మరోసారి పోలింగ్ శాతం పెంచుకోవడంలో వెనకబడిందనే అంటున్నారు. అయితే రూరల్ జిల్లాలో మాత్రం పోలింగ్ కొంత బాగా అయింది. చాలా చోట్ల డెబ్బై  శాతాలు కూడా దాటాయి. మరి సిటీలోని ఓటర్లే ఎక్కువగా బూత్ లకు రావడం లేదు అన్న విమర్శ అయితే ఉంది.