అవకాశాల్లేక, ఫేడ్-అవుట్ అయ్యే స్థితిలో ఉన్న ఓ హీరోయిన్ ఇప్పటికే తన రేటును అమాంతం తగ్గించేసిన విషయాన్ని గతంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే దారిలో మరో హీరోయిన్ అడుగుపెట్టింది. ఈ హీరోయిన్ అయితే రెమ్యూనరేషన్ తగ్గించడం కాదు, ఏకంగా పారితోషికం అనే కాన్సెప్ట్ నుంచే బయటకొచ్చేసింది. డెయిలీ పేమెంట్స్ విధానంలోకి మారింది.
చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఆ హీరోయిన్. కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు. ఆమధ్య ఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసినా కలిసిరాలేదు. ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేస్తూ, డేటింగ్ రూమర్స్ కూడా ఎదుర్కొంది.
ఇప్పుడా హీరోయిన్ కు అవకాశాలు ఆల్ మోస్ట్ అడుగంటాయి. దీంతో పారితోషికం తీసుకునే పద్ధతి నుంచి బయటకొచ్చి, కాల్షీట్ పేమెంట్ సెట్ చేసుకుంది. హీరోయిన్ రోల్ అయినా, అతిధి పాత్ర అయినా, ఐటెంసాంగ్ అయినా ఏదైనా కాల్షీట్ లెక్కన ఆమెకు సమర్పించుకోవాల్సిందే.
హీరోయిన్ గా ఉన్నప్పుడు సినిమాకు 40 లక్షల వరకు అందుకున్న ఆ హీరోయిన్, ప్రస్తుతం డెయిలీ పేమెంట్స్ లోకి మారి.. ఒక్కో సినిమాకు 15-20 లక్షల రూపాయల వరకు మాత్రమే సంపాదిస్తోంది. సంపాదన సంగతి పక్కనపెడితే, కనీసం ఆ మాత్రమైనా ఆఫర్లు వస్తున్నందుకు సంతోషంగా ఉందామె.
ఎందుకంటే, మిగతా హీరోయిన్లలా ఆమెకు ఫొటోషూట్లు ఉండవు. ఎందుకంటే బాడీ షేప్ అవుట్ అయిపోయింది. ఇతర హీరోయిన్లలా ఓపెనింగ్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్లు కూడా తక్కువే. కాబట్టి వచ్చిన అరకొర ఆఫర్లతోనే, ఎంతొస్తే అంత అన్నట్టుగా బండి లాగించేస్తోంది. ఒకప్పుడు తన అందాలతో అబ్బా అనిపించిన ఆ బ్యూటీ, ఇప్పుడు కుర్ర హీరోయిన్ల దెబ్బకు విలవిల్లాడిపోతోంది.