సెకండాఫ్ కుమ్ముడే కుమ్ముడు

2023 తొలిసగం సినిమా లవర్స్ ను చాలా నిరాశ పర్చింది. ముఖ్యంగా సమ్మర్ పూర్తిగా వృధా అయిపోయింది. ఇలా తొలి నెలలు (సంక్రాంతి మినహాయిస్తే) పెద్దగా మెరుపులు లేకుండానే ముగిసిపోయాయి. ఇప్పుడు సెకండాఫ్ మొదలవుతోంది.…

2023 తొలిసగం సినిమా లవర్స్ ను చాలా నిరాశ పర్చింది. ముఖ్యంగా సమ్మర్ పూర్తిగా వృధా అయిపోయింది. ఇలా తొలి నెలలు (సంక్రాంతి మినహాయిస్తే) పెద్దగా మెరుపులు లేకుండానే ముగిసిపోయాయి. ఇప్పుడు సెకండాఫ్ మొదలవుతోంది. చూస్తుంటే ఈ సెకండాఫ్ మాత్రం అదరగొట్టేలా కనిపిస్తోంది. వచ్చిన అనౌన్స్ మెంట్లు, రానున్నవి అన్నీ చూస్తుంటే మాంచి కమర్షియల్ కలర్ కనిపిస్తోంది.

జూలై నెల పవర్ స్టార్ ‘బ్రో’ సినిమాతో శ్రీకారం చుడుతోంది. జూలై ఆఖరివారంలో ఈ సినిమా వస్తోంది. దానికి పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మెగాస్టార్ భోళాశంకర్ వస్తోంది. అదే టైమ్ లో రజనీ జైలర్ కూడా వస్తోంది. ఈ రెండు సినిమాలకు ఓ వారం ముందుగా నవీన్ పోలిశెట్టి, అనుష్క ల మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి వస్తోంది. నవీన్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. అందువల్ల ఈ సినిమా కోసం ఎదురు చూపులు బాగానే వున్నాయి. ఆగస్టు మూడో వారంలో వరుణ్ తేజ్ సినిమా గాండీవ ధారి వుండనే వుంది.

మొత్తం మీద ఆగస్ట్ లో నాలుగు సినిమాలు గట్టిగా వుండేలా వున్నాయి.

సెప్టెంబర్ వినాయకచవితి నెల. విజయ్ దేవరకొండ-సమంత ల ఖుషీ తో ప్రారంభమవుతోంది. ఆ పై వారమే షారూఖ్ జవాన్ వుంది. ఆ పైవారమే బోయపాటి-రామ్ ల స్కంద వుంది. ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ విడుదలయ్యేది సెప్టెంబర్ లోనే. ఆ నెల ఆఖరివారంలో వస్తుందా సినిమా.

అక్టోబర్ నెల దసరా సీజన్. కానీ మరీ ఎక్కువగా సినిమాలు లేవు. బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతానికి డేట్ లు ఇచ్చి వున్నాయి. అదే టైమ్ లో విజయ్ సినిమా కూడా వుండొచ్చు. ఏమైనా అక్టోబర్ దసరా టైమ్ కు ముందు వెనుక ఖాళీనే.

నవంబర్ నెల..దీపావళి. కానీ ప్రస్తుతానికి నవంబర్ నెల వరకు సినిమాల ప్రకటనలు రాలేదు. కానీ డిసెంబర్ లో పవన్ ఓజి, నాని చేస్తున్న సినిమా. వెంకీ సైంధవ్ రాబోతున్నాయి. 

అంటే ఒక్క నవంబర్ నెల తప్పితే మిగిలిన అయిదు నెలలు టాలీవుడ్ లో విడుదల హడావుడులు మామూలుగా వుండవు. ఫుల్ ఫైర్ నే.