అక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. ఈ మేరకు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన చేశారు.

స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు వేయడం ఆనవాయితీ. కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే పుష్ప-2 ప్రీమియర్ టైమ్ లో సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది.

దీంతో బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి ప్రకటించారు.

తొక్కిసలాటలో మృతిచెందిన మహిళ కుటుంబీలకు తన సానుభూతి తెలిపిన మంత్రి.. సినీ నిర్మాత, హీరో కలిసి బాధితుల్ని ఆదుకోవాలన్నారు. బెనిఫిట్ షోల రద్దు దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇకపై పెద్ద సినిమాలకు మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉండకపోవచ్చు.

సరిగ్గా కొన్నేళ్ల కిందట తమిళనాట కూడా ఇలానే జరిగింది. అజిత్ సినిమా రిలీజ్ సందర్భంగా అతడి అభిమాని ఒకరు మృత్యువాత పడ్డంతో, తమిళనాడు ప్రభుత్వం అక్కడ బెనిఫిట్ షోలు, మిడ్-నైట్ షోలు రద్దు చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కారణంగా తెలంగాణలో కూడా బెనిఫిట్ షోలు రద్దయ్యాయి. సంక్రాంతికి రాబోయే సినిమాలపై ఈ ప్రభావం గట్టిగా పడనుంది.

10 Replies to “అక్కడ అజిత్.. ఇక్కడ అల్లు అర్జున్”

  1. ఇకనుంచైనా హీరోలు ఇలా బెనిఫిట్ షోలు వేసేటప్పుడు తమతో ఎవరిని తీసుకువస్తున్నారో ఒకటికి రెండు సార్లు పరిక్షించుకోవాలి.

    తర్వాత లబోదిబో అంటే ప్రయోజనం లేదు.

Comments are closed.