నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదు

మంచు ఫ్యామిలీలో జరిగే వివాదాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అంతా కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఏమీ లేదంటారు.

మంచు కుటుంబంలో ఏదో జరుగుతోంది. అదేంటనేది మనకు అనవసరం. ఎందుకంటే, అది వాళ్ల ఫ్యామిలీ మేటర్. అయితే వాళ్ల నుంచి ఎవరైనా బయటకొస్తే మాత్రం కచ్చితంగా అది అందరి మేటర్ అవుతుంది. ఎందుకంటే, వాళ్లంతా సెలబ్రిటీలు. వాళ్లకు సంబంధించింది వ్యక్తిగతమైనా అందరికీ ఆసక్తిదాయకమే.

అయితే మంచు ఫ్యామిలీలో జరిగే వివాదాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అంతా కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఏమీ లేదంటారు.

వీడియో వచ్చినా ఉత్తిదే అన్నారు..

ఆమధ్య మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవ పడ్డారు. అన్నదమ్ములు గొడవ పడడంతో ఆటోమేటిగ్గా అందరి దృష్టి అటువైపు మళ్లింది. పైగా ఎంత కాదన్నా ఇద్దరూ హీరోలే. దీనికితోడు వీడియో కూడా బయటకొచ్చింది. అదేదో లీక్ అయిన వీడియో కాదు, అప్పట్లో స్వయంగా మంచు మనోజ్ రిలీజ్ చేశాడు.

దీంతో అందరి దృష్టి అటుపడింది. అన్నదమ్ముల మధ్య గొడవలున్నాయంటూ చాలా లీకులు వచ్చినప్పటికీ, ఆ వీడియోతో మేటర్ కాస్తా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఆ వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగడం, సర్దుబాటు చేయడం, ఫలితంగా వీడియో డిలీట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మంచు విష్ణును అడిగితే కుటుంబంలో చిన్నచిన్న గొడవలు కామన్ అనేశాడు.

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గడబిడ..

ఇది జరిగిన కొన్నాళ్లకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు మోహన్ బాబు. మంచు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మధ్య ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రావడం చర్చనీయాంశమైంది. ఆ టైమ్ లో కొంతమంది మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, అది మరింత ఎటెన్షన్ కు దారితీసింది.

ఇప్పుడు తండ్రీకొడుకులు..

అది జరిగిన కొన్ని నెలలకు ఇప్పుడు ‘మంచు’లో మరో పొగ మళ్లీ కనిపించింది. ఆశ్చర్యంగా ఈసారి తండ్రీకొడుకులు గొడవ పడ్డారు. మోహన్ బాబు తన అనుచరులతో కన్నకొడుకైన మనోజ్ ను కొట్టించారనే ప్రచారం జరిగింది. దీనిపై ఉభయులు పోలీస్ కేసులు వేసుకున్నారని కూడా వార్తలొచ్చాయి.

ఎప్పట్లానే ఈ వార్తలొచ్చిన గంటల వ్యవథిలోనే ఖండనా ప్రకటనలు కూడా వచ్చేశాయి. తండ్రీకొడుకులు కొట్టుకోలేదని, అంతా అసత్య ప్రచారం అంటూ ఓవైపు ఖండన ప్రకటనలు వస్తుంటే, మరోవైపు మంచు మనోజ్ కుంటుకుంటూ వెళ్లి ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్ మెట్లు ఎక్కడానికి కూడా భార్యతో పాటు మరొకరు సహాయం చేయాల్సి వచ్చింది.

ఇలా వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉన్నారు మంచు కుటుంబ సభ్యులు. వీడియోలు బయటకొచ్చిన తర్వాత అసత్య ప్రచారం అంటూ ఖండిస్తున్నారు. అంతవరకు రాకుండా ఇంట్లో కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటే మీడియా జోక్యమే ఉండదు కదా.

21 Replies to “నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదు”

  1. Mohanbabu oka paniki malina vadu. Industry lo undalsina vadu kadu. Edo adrushtam koddi actor ayyadu. Mukku sutithanam, kramasikshna musugu lo ishtam vachinatlu alagayi janam matladutadinatlu matladatadu. School, college lekapothe eepatiki adukkune vallu

  2. ‘కన్నప్ప’ ప్రమోషన్స్ కోసమేనా ఈ పబ్లిసిటీ స్టంట్ అంతా?

    ఎంత చెడ్డా అన్న కదా, తమ్ముడు ఈ రకంగా సాయం చేస్తున్నాడేమో!!!

  3. Amma ayya pedithe tini taagi thonguni inkaa naaku idi ledu adi ledu ani edche entitled batch ki prime representative. tikka regi rendu peeki vuntadu. Chinappudu cheyalsindi peddayyaka chesthe emosthadi. mokkai vanganidi maanai vangunaa.

  4. Mom dad feeding and this fellow eating drinking and sleeping. Now crying he wants something more. Age increased but brain did not grow. Prime example of rich spoilt kid who does not know what to do in life but thinks he deserves everything.

Comments are closed.