జమిలి ఎన్నికలతో కూటమి నేతల్ని వైసీపీ భయపెడుతోంది. ఒకవేళ జమిలి ఎన్నికలొచ్చినా, 2029లో మాత్రమే జరుగుతాయని సీఎం చంద్రబాబునాయుడు ధీమాగా చెబుతున్నారు. బాబు చెప్పే ప్రకారం సార్వత్రిక ఎన్నికలు అప్పుడే జరగాలి. అంటే ఏపీలో వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా ముందస్తు ఎన్నికలు జరగవని చంద్రబాబు కూటమి శ్రేణులకు భరోసా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో ఇవాళ కీలక కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు సిద్ధంగా వుండాలని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం.
గతంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో పార్టీకి తీసుకున్న కార్యాలయాన్నే తిరిగి సెంటిమెంట్‌గా ఇవాళ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు కోఆర్డినేటర్‌గా తిరిగి రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందర్నీ కలుపుకుని వెళ్లాలని విజయసాయిరెడ్డి సూచించారు. ప్రతి కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా వుంటారని ఆయన అన్నారు. కార్యకర్తలకు నష్టం జరగకుండా జగన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ఇన్‌చార్జ్‌లు పార్టీ శ్రేణులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.
అంతవరకూ నువ్వు బతికేవుంటావా? 🤔
అన్నారు, అనుకుంటున్నారు, భావిస్తున్నారు
Age entha mama koduku Dhi? First birthday chesava?
😂
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మంచి స్వీట్ స్పాట్ లో వుంది కారణం సెంట్రల్ govt ఆంధ్ర ఎంపీ ల మీద ఆధారపడి వుంది ఈ పరిస్థితి 2029 వరకు ఉంటే పోలవరం రైల్ ప్రాజెక్ట్ లు హైవేస్ పోర్టులు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం బాగా ఇస్తా సహకరిస్తుంది పెట్టుబడులు కూడా బాగా రావటానికి సహకరిస్తుంది తరవాత మన అవసరం లేకపోతె ఈ మాదిరి గ ఇవ్వదు కాబట్టి మనం ఈ పరిస్థితే కొనసాగేలా చూడాలి
2027 లో జరిగిన 2029 లో జరిగిన మా అన్నయ్య వై నాట్ 175 కొట్టడం గ్యారంటీ : తింగరి గొర్రెలు
మా అన్నయ్య గెలుపు గ్యారంటీ అన్నమాట
Why not 175 laga vundi ee vyavaharam
బూతులు లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చేసే కామెంట్స్ ని పోస్ట్ చేస్తుంటే .. యాక్సెప్ట్ చేసే ధైర్యం లేక డిలీట్ చేస్తున్న మీరు వెబ్సైట్ నడపటం వేస్ట్ .. లేదంటే కామెంట్ సెక్షన్ తీసేయండి
ఏంటి సర్ .. next జరిగే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితం చేద్దామని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఏకంగా గెలిచెద్దమని కలలు కంటున్నారా
చాలా ఆత్రంగా ఉన్నారు… కానీ బయట ఏం జరుగుతుందో కూడా గమనించాలి.. ఏ ఎన్నికలు జరిగినా ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం చేద్దామని కూటమి ప్రయత్నిస్తుంది .. ఒకవైపు రాజధాని పనులు, పోలవరానికి ఫండ్స్, కొత్త కంపెనీలకి ఒప్పందాలు, ప్రతిపక్ష నేతలు పాత కేసులతో ఉక్కిరి బిక్కిరి… ఇటువైపు ప్రతిపక్ష ప్రయత్నాలు, కృషి చూస్తుంటే శూన్యం .. దానికితోడు రోజుకొక అవినీతి కేసు బయటపడి ప్రతిపక్షం పైన జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.. మీడియా, సోషల్ మీడియాలో ప్రతిపక్షం వీక్ గా కనిపిస్తోంది .. ఇవన్నీ చూస్తూ కూడా ఇంత కాన్ఫిడెన్స్ గా జామిలి కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు