ట్రోల్ ఎఫెక్ట్.. ఆదిపురుష్ కు మార్పులు

2 రోజులుగా ఆదిపురుష్ పై ఘోరంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ పై విమర్శల వాన కురుస్తోంది. దీంతో మేకర్స్ దిగొచ్చారు. ఆదిపురుష్ లో కొన్ని డైలాగ్స్…

2 రోజులుగా ఆదిపురుష్ పై ఘోరంగా ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ పై విమర్శల వాన కురుస్తోంది. దీంతో మేకర్స్ దిగొచ్చారు. ఆదిపురుష్ లో కొన్ని డైలాగ్స్ ను మారుస్తున్నామని ప్రకటించారు.

“ఈ విజువల్ వండర్ తో మరింత సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు, సినిమాలో కొన్ని డైలాగ్స్ లో మార్పులు చేయాలని టీమ్ నిర్ణయించింది. ప్రజలు, ప్రేక్షకుల నుంచి వచ్చిన ఇన్-పుట్స్ కు విలువనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం” అంటూ ప్రకటించింది ఆదిపురుష్ యూనిట్.

ఆదిపురుష్ సినిమాలో లంకా దహనం ఎపిసోడ్ లో భజరంగీ చెప్పిన డైలాగ్స్ వివాదాస్పదమయ్యాయి. “గుడ్డ నీ బాబుది, చమురు నీ బాబుది, అగ్ని కూడా నీ బాబుదే. కాబట్టి కాలేదీ నీ బాబుదే” అంటూ హనుమంతుడు చెప్పిన డైలాగ్ చాలామందికి నచ్చలేదు.

దీంతోపాటు మరికొన్ని డైలాగ్స్ లో మార్పులు చేస్తామంటూ యూనిట్ ప్రకటించింది. ఈ మార్పులు మరో 3-4 రోజుల్లో థియేటర్లలో కనిపిస్తాయి.

ఆదిపురుష్ సినిమాలో ఇప్పటికే లిప్ సింక్ లు మిస్సయ్యాయి. ప్రభాస్ తో పాటు సన్నీసింగ్, సైఫ్ అలీఖాన్ చెప్పిన ఎన్నో డైలాగ్స్ కు తెలుగు వెర్షన్ డబ్బింగ్ కుదరలేదు. ఇప్పుడు తాజాగా చేయబోయే మార్పులతో, ఈ లిప్ సింక్ లు మరిన్ని మిస్సయ్యేలా ఉన్నాయి.