నవ్విపోదురు గాక..మాకేటి సిగ్గు

కోర్టులో జగన్ కు షాక్…కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు..జగన్ కు ఝలక్…ఇలాంటి శీర్షికలు చాలా చూసే వుంటారు. కానీ సిఎమ్ గా జగన్ తరపున ప్రభుత్వం వేసిన కేసులో విన్ అయితే, ఎలాంటి హెడ్డింగ్ లు…

కోర్టులో జగన్ కు షాక్…కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు..జగన్ కు ఝలక్…ఇలాంటి శీర్షికలు చాలా చూసే వుంటారు. కానీ సిఎమ్ గా జగన్ తరపున ప్రభుత్వం వేసిన కేసులో విన్ అయితే, ఎలాంటి హెడ్డింగ్ లు రావాలి. 

ఎన్నికల కమిషన్ కు షాక్…నిమ్మగడ్డకు ఝలక్..కోర్టులో ఎన్నికల కమిషన్ కు చుక్కెదురు..ఇలాంటి హెడ్డింగ్ లే కదా రావాలి.

కానీ నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్లు అన్నీ వదిలేసి వార్తలు అందించే ఓ వర్గపు తెలుగు మీడియా కు మాత్రం ఈసారి అలాంటి పరుష పదజాలం అస్సలు గుర్తుకు రాలేదు. సింపుల్ గా ఎన్నికల షెడ్యూలుకు హైకోర్టు బ్రేక్, జగన్ కు కోర్టులో ఊరట..ఇలాంటి శీర్షికలు వండి వార్చారు.

ఇక్కడే అర్థం కావడం లేదా..ఈ సిగ్గుమాలిన మీడియా వ్యవహారం. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినంత మాత్రాన చూసేవాళ్లు చూడకుండా వుండరు. జనం ఈ మీడియాల వైనాలు చిరకాలంగా గమనిస్తున్నారు. 

అందుకే వీళ్లు ఎంత టముకు వేసినా, చంధ్రబాబు తరపున ఎంత చిడతలు వాయించినా, జనం చేయాల్సిన పని చేసారు. అయినా కూడా ఇంకా గుణపాఠం రాలేదు. ఇంకా జనాలను తమ రాతలతో మభ్య పెట్టాలనే ప్రయత్నం సాగిస్తూనే వున్నారు.

బాబుగారు చేసినవన్నీ లోక కళ్యాణం కోసం అన్నట్లు జగన్ చేసినవన్నీ క్షవర కళ్యాణం కోసం అన్నట్లు రాతలు వండి వారుస్తూనే వున్నారు. కానీ వీరు గమనించాల్సింది ఇంకోటి వుంది. 

ఇలాంటి రాతల వల్ల చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి మేలు కలగడం లేదన్నది. ఇలాంటి రాతలు అన్నీ బాబు తరపున రాస్తున్నారు అని జనం అనుకుని, ఆయనకు ఇది పద్దతికాదని, మరింత దూరం జరుగుతున్నారు.

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?