ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ!

ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని…

ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ పై రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 

కాగా ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం, వందలాంది కుటుంబాలకు కడుపుకోత మిగిల్చింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించార‌ని.. దాదాపు 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే, మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా అనేది సీబీఐ విచారణ ద్వారా తేల్చనున్నారు.

మరోవైపు.. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానింగ్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ప్రమాదం సంభవించిందని.. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని.. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించినట్టుగా తెలిపారు. సరైన విచారణ తర్వాత ఎవరు చేసారో, ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు.