సి సి బ్యానర్లో మెగా సినిమా

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కు టాలీవుడ్ లో ఓ నేమ్ వుంది. అనేకానేక హిట్ సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. కాలంతో పరుగెట్టలేక, లేదా మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు సెట్…

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కు టాలీవుడ్ లో ఓ నేమ్ వుంది. అనేకానేక హిట్ సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. కాలంతో పరుగెట్టలేక, లేదా మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా సినిమాలు సెట్ చేసుకోలేకనో వెనుకబడింది ఈ బ్యానర్. మెగాస్టార్ తో సి సి అధినేత కే ఎస్ రామారావుకు మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధంతోనే భోళాశంకర్ సినిమాకు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ను జోడించారని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు విడుదల దగ్గరకు వచ్చేసరికి భోళాశంకర్ పోస్టర్ల మీద నుంచి క్రియేటివ్ కమర్షియల్స్ పేరు మాయమైంది. దీని వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. భోళాకు ఖర్చు ఎక్కువ కావడంతో భాగస్వామ్యం తీసేసి, సింగిల్ బ్యానర్ నే మిగిల్చారని కూడా వార్తలు వున్నాయి.

అసలు ఏమైంది అని ఆరా తీస్తే…ఈ ఏడాది సి సి బ్యానర్ కు 50వ సంవత్సరమట. అందుకే ఈ స్వర్ణోత్సవ వేళ ఓ మాంచి సినిమా మెగాస్టార్ తో చేయాలనే ప్లాన్ లు సాగుతున్నాయని తెలుస్తోంది. కథ, డైరక్టర్ ఇవన్నీ ఫిక్స్ కావాల్సి వుంది. మెగాస్టార్ హీరో గా సినిమా అన్నది మాత్రం పక్కా.

అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మెగాస్టార్ బర్త్ డే కు వస్తుందా? ఈ ఏడాది చివరిలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ స్ధాపన డేట్ కు వస్తుందా అన్నది చూడాలి.