బాబు వీర భక్తుడికి భారీ దెబ్బ?

తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వరసపెట్టి దెబ్బలు పడుతున్నాయి. విశాఖలో  ఆపరేషన్ భూ ఆక్రమణలు పేరిట పెద్ద ఎత్తున భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  Advertisement విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి…

తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వరసపెట్టి దెబ్బలు పడుతున్నాయి. విశాఖలో  ఆపరేషన్ భూ ఆక్రమణలు పేరిట పెద్ద ఎత్తున భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 

విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామక్రిష్ణ బాబు ఆక్రమించినట్లుగా చెబుతున్న భూములను రెవిన్యూ అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకుని గట్టి షాక్ ఇచ్చారు.

విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పబడిన రుషికొండ సమీపంలోని గెడ్ద ప్రాంతాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆక్రమించినట్లుగా రెవిన్యూ  అధికారులు  గుర్తించి ఈ తెల్లవారుజామున జరిపిన ఆపరేషన్ లో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెలగపూడికి భారీ షాక్ తగిలినట్లు అయింది.

చంద్రబాబుకు వీర విధేయుడు అయిన వెలగపూడి విశాఖ రాజధాని వద్దు, అమరావతే ముద్దూ అంటూ ఏకంగా అసెంబ్లీలో స్పీకర్ చైర్ దాకా వచ్చి అప్పట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాబు సొంత సామాజికవర్గానికి చెందిన వెలగపూడి విజయవాడకు చెందినవారు.

ఆయన లిక్కర్ వ్యాపారాలను విశాఖలో నిర్వహిస్తూ ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. విశాఖలో వరసగా సాగుతున్న ఆపరేషన్ భూ ఆక్రమణలులో కొనసాగింపుగా ఇపుడు వెలగపూడి మీద ఇలా దెబ్బ పడిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న ఆనందపురం మండలంలో దాదాపు 300 ఎకరాలను కూడా ఈ రోజు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అంచనా. మొత్తానికి విశాఖ టీడీపీ తమ్ముళ్ళకు వీకెండ్ షాకులు గట్టిగానే తగులుతున్నాయని అంటున్నారు. 

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న