18న థియేటర్లలోకి ‘వి’

2020 ప్రారంభంలోనే మంచి హోప్ తో నిర్మాణం జరుపుకున్న సినిమా వి. డైరక్టర్ ఇంద్రగంటి, హీరోలు నాని, సుధీర్ బాబు ల కాంబినేషన్ లో ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. …

2020 ప్రారంభంలోనే మంచి హోప్ తో నిర్మాణం జరుపుకున్న సినిమా వి. డైరక్టర్ ఇంద్రగంటి, హీరోలు నాని, సుధీర్ బాబు ల కాంబినేషన్ లో ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. 

కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఎంతకీ తెరచుకోకపోవడంతో ఆఖరికి అమెజాన్ ప్రయిమ్ కు ఇచ్చేసారు. అమెజాన్ లో విడుదలయిన నెల రోజులకు థియేటర్లో విడుదల చేసుకునే సౌలభ్యం వుంది. 

ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని వాడుకుని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లు ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెలమెల్లగా మల్టీ ఫ్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. అలాగే సింగిల్ స్క్రీన్ లు కూడా ఓపెన్ కావాల్సి వుంది.

అందుకే దిల్ రాజు తన లీజు కింద వున్న థియేటర్లను తెరవాలని, ఆ ఓపెనింగ్ కూడా వి సినిమాతో చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎవరైనా మిగిలిన జిల్లాల్లోని థియేటర్లలో వి సినిమా ప్రదర్శిస్తామంటే కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

మ‌హేష్ తో ఒక్క‌డు కంటే గొప్ప సినిమా తీయాలి