ట్రైల‌ర్‌పై ఎయిర్‌ఫోర్స్ అభ్యంత‌రం

సినిమా అనేది అత్యంత వేగంగా ప్ర‌భావితం చేసే మాధ్య‌మం. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని తెర‌కెక్కించాల‌ని భావిస్తే… దాని గురించి పూర్తిగా అధ్య‌య‌నం చేయాలి. మ‌రీ ముఖ్యంగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, మిల‌ట‌రీకి సంబంధించి సీన్ల‌ను…

సినిమా అనేది అత్యంత వేగంగా ప్ర‌భావితం చేసే మాధ్య‌మం. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని తెర‌కెక్కించాల‌ని భావిస్తే… దాని గురించి పూర్తిగా అధ్య‌య‌నం చేయాలి. మ‌రీ ముఖ్యంగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, మిల‌ట‌రీకి సంబంధించి సీన్ల‌ను క్రియేట్ చేయాల‌నుకున్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్తగా అడుగులు వేయాలి. ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా , దేశ ఆత్మ‌గౌర‌వానికే మ‌చ్చ తెచ్చిన‌ట్ట‌వుతుంది. దీంతో విమ‌ర్శ‌ల‌పాలు కావాల్సి వ‌స్తుంది.

స‌రిగ్గా ఇప్పుడు బాలీవుడ్ న‌టుడు అనిల్‌క‌పూర్, డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ లీడ్‌రోల్స్‌లో తెర‌కెక్కిస్తున్న ఏకే వ‌ర్సెస్ ఏకే సినిమా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మాదిత్య మోత్వ‌నే. అనిల్ క‌పూర్‌, అనురాగ్ వారి నిజ జీవిత పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 7న సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. అనిల్-అనురాగ్ మ‌ధ్య గొడ‌వ‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది.

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్  యూనిఫామ్‌లో  అనిల్ క‌పూర్ క‌నిపిస్తున్నాడు.  ఈ ట్రైల‌ర్ పై ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ఈ మేర‌కు ట్వీట్ చేసింది. యూనిఫాంను త‌ప్పుగా చూపించార‌ని ఎత్తి చూపింది. అంతేకాకుండా, ట్రైల‌ర్‌లో వాడిన ప‌ద‌జాలం స‌రిగా లేద‌ని ఎయిర్‌ఫోర్స్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ట్రైల‌ర్‌లో చూపించిన‌ట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో అలాంటి నియ‌మాలు ఎక్క‌డా క‌నిపించ‌వని ఆ విభాగం పేర్కొంది. కావున  ఐఏఎఫ్ కు సంబంధించిన సీన్ల‌ను తొల‌గించాల‌ని సంబంధిత‌ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.  దీనిపై ఆ చిత్ర యూనిట్ స్పంద‌న ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

మ‌హేష్ తో ఒక్క‌డు కంటే గొప్ప సినిమా తీయాలి