ఇలాగైతే రాజమౌళితో మహేష్ చేస్తాడా?

బాహుబలి చిత్రానికి అన్నేళ్లు పట్టడంతో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనుకున్నాడు. కేవలం ఏడాదిలోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేసేస్తానని ఎన్టీఆర్, చరణ్ దగ్గర డేట్స్ తీసుకున్నాడు.  Advertisement కరోనా వచ్చి ఇప్పుడు…

బాహుబలి చిత్రానికి అన్నేళ్లు పట్టడంతో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనుకున్నాడు. కేవలం ఏడాదిలోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేసేస్తానని ఎన్టీఆర్, చరణ్ దగ్గర డేట్స్ తీసుకున్నాడు. 

కరోనా వచ్చి ఇప్పుడు ఆ సినిమా ఎప్పటికి పూర్తవుతుందనేది తెలియదు కానీ అది రాకముందు అయినా ఆర్.ఆర్.ఆర్.ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేక విడుదల వాయిదా వేసాడు. 

ఇంకా నిర్మాణ దశలోనే వున్న ఆర్.ఆర్.ఆర్. 2022లో కానీ విడుదల కాదని ఘంటాపధంగా చెబుతున్నారు. ఇలా ప్రతి సినిమాకూ ఏళ్ల తరబడి సమయం తీసుకుంటోన్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్‌తో అనౌన్స్ చేసాడు. 

కానీ మహేష్ ఇప్పుడు ఏ సినిమాకు అయినా ఆరు లేదా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఇస్తున్నాడు. ప్రతి సినిమా మధ్య ఫ్యామిలీ హాలిడే కూడా కచ్చితంగా తీసుకుంటాడు.

అలాంటి వర్కింగ్ స్టయిల్‌కి అలవాటు పడిన మహేష్ ఈ టైమ్‌లో రాజమౌళితో సినిమా చేస్తూ ఒక మూడు, నాలుగేళ్ల సమయం కేటాయించగలడా? ఆల్రెడీ నలభై అయిదేళ్ల వయసు వచ్చింది కనుక రాజమౌళితో సినిమా చేస్తే, అది పూర్తయ్యే సరికి యాభైకి దగ్గర పడతాడు కనుక మహేష్ ఆ తర్వాత ఆ క్రేజ్‌ని ఎంతకాలం వాడుకోగలడు? 

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి