ఫ్లాప్ సినిమాలు హిందీలోకి అనువదిస్తే వాటికి కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తూ వుండడంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో స్ట్రెయిట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
మాస్‌కి నచ్చే ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌ను తొలి సినిమాగా ఎంచుకున్నాడు. హిందీ దర్శకులు ఆ కథకు న్యాయం చేయలేరేమోనని వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నాడు.
పదిహేనేళ్ల పాత కథను ఎంచుకుని తన తెలుగు మార్కెట్‌ను పక్కనపెట్టి ఎక్స్‌క్లూజివ్ హిందీ చిత్రం చేయడం అంత తెలివైన పని అనిపించడం లేదు.
హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టే ఉద్దేశం వుంటే తెలుగులో కూడా విడుదల చేసుకునే ప్రాజెక్ట్ సెట్ చేసుకుని వుండాల్సింది. ఛత్రపతి మంచి మాస్ ఎంటర్టైనర్ అయినా కానీ ఇప్పుడా ఫార్ములా ఫలిస్తుందా అనేది అనుమానమే.
అందులోను తెలుగు హీరో వచ్చి బాలీవుడ్లో ఏదైనా కొత్తరకం సినిమా చేస్తే ఓకే కానీ సల్మాన్, రణ్వీర్, అజయ్ దేవ్గన్ లాంటి హీరోలుండగా బెల్లంకొండ శ్రీనివాస్‌ను యాక్షన్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారనేది డౌటే.
యూట్యూబ్‌లో ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి, థియేటర్‌కి టికెట్ కొని వెళ్లేదానికీ డిఫరెన్స్ వుందా లేదా అనేది కూడా ఈ చిత్రంతో క్లారిటీ వచ్చే అవకాశముంది.