పోపో పోపో పోస్కో….బీజేపీకి చుక్కలేనా ..?

విశాఖలో ఎంతో బలముందని బీజేపీ చెప్పుకుంటోంది. దానితో పాటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో చక్రం తిప్పేస్తామని కూడా ముచ్చట పడుతోంది. ఆ పార్టీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు పలుమార్లు విశాఖలో టూర్లేసి మరీ మేమే ఏపీకి…

విశాఖలో ఎంతో బలముందని బీజేపీ చెప్పుకుంటోంది. దానితో పాటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో చక్రం తిప్పేస్తామని కూడా ముచ్చట పడుతోంది. ఆ పార్టీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు పలుమార్లు విశాఖలో టూర్లేసి మరీ మేమే ఏపీకి భవిష్యత్తు అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు.

కానీ మొత్తం విశాఖకే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటిదాక లోకల్ లీడర్స్ కానీ స్టేట్ లీడర్స్ కానీ పెదవి విప్పలేదు. పైగా స్టీల్ ప్లాంట్ భూములను అప్పనంగా సౌత్ కొరియాకు చెందిన పోస్కోకు కట్టబెడుతూ మోడీ సర్కార్ ఈ మధ్య ఒప్పందం చేసుకుంటే దానికి మీద కూడా స్పందించేందుకు  ఎవరూ కూడా ముందుకు రాలేదు.

దీంతో పోపో పోపో పోస్కో అంటూ విశాఖలో ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. వామపక్ష నాయకులు  దీన్ని భుజాలకెత్తుకుని పోస్కో ఒప్పందం నుంచి మోడీ సర్కార్ వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ నుంచి ఏటా ముప్పయి వేళ కోట్ల రూపాయలను పన్నుల రూపయంలో కేంద్రం అందుకుంటోందని, అలాంటిది పోస్కోని తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చూడడమేంటని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు బీజేపీ మీద మండిపడుతున్నారు. 

పోస్కోని ప్లాంట్ నుంచి వెళ్ళగొట్టేందుకు ఎంతదాకనైనా వెళ్తామని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జనసేనతో కలసి విశాఖాలో పాగా వేయవచ్చునని మురిసిపోతున్న బీజేపీకి పోస్కో పెద్ద ఎత్తున  బ్రేకులు వేస్తోంది. 

రోజూ పొద్దున్నే బంగారం తింటున్నా