బీజేపీ పిలుస్తోంది.. విజయశాంతి వెళతారా మరి.?

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు చాలా చాలా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి బాగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ, ఏమయ్యిందోగానీ మళ్ళీ స్థానిక ఎన్నికలొచ్చేసరికి చతికిలపడింది.…

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు చాలా చాలా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి బాగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ, ఏమయ్యిందోగానీ మళ్ళీ స్థానిక ఎన్నికలొచ్చేసరికి చతికిలపడింది. అయితే, కిందపడ్డా పై చేయి తమదే అన్నట్లు.. రాజకీయంగా తమ బలం తెలంగాణలో మరింత పెరిగిందని కమలనాథులు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, బీజేపీ అధిష్టానం సినీ నటి, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలకు తెరలేపినట్లు తెలుస్తోంది. బీజేపీతో ఆమెకు గతంలో సన్నిహిత సంబంధాలుండేవి. ఆమె బీజేపీలో కొన్నాళ్ళు పనిచేశారు కూడా. దాంతో ఆమె తిరిగి బీజేపీలోకి రావడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు విజయశాంతి. ఎన్నికల సమయంలో విజయశాంతికి పార్టీలో కీలక పదవులు ఇవ్వడం, ఆ తర్వాత ఆమెకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గడం.. ఇదో పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. అయితే, కాంగ్రెస్‌ అధిష్టానంతో ఆమెకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనుకోండి.. అది వేరే విషయం.

ఇక, తాజాగా తన సినీ ప్రయాణానికి ఇంకోసారి ఆమె 'సెలవు' ప్రకటించారు. ప్రజా జీవితం పట్ల బాధ్యత కలిగిన తాను, మళ్ళీ సినిమాల్లో నటిస్తానో లేదో తనకే తెలియదంటూ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వేశారామె. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమె ఇటీవల నటిగా రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. ఏమయ్యిందోగానీ, ఇంతలోనే విజయశాంతి మనసు మార్చుకున్నట్లు కన్పిస్తోంది. అలా ఆమె మనసు మార్చుకోవడానికి తాజా రాజకీయ పరిణామాలే కారణమనే చర్చ జరుగుతోంది.

సినిమాలు ఎప్పుడూ మోసం చెయ్యవు మనుషులే