బాలయ్య-బోయపాటి సినిమాకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విగ్గు నప్పడం కోసమో, హెయిర్ వీవింగ్ కోసమో మొత్తానికి బాలయ్య గుండు చేయించుకున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే అసలు విషయం వేరే వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. బోయపాటి సినిమాలో బాలయ్య రెండు పాత్రలు ధరిస్తున్నట్లు బోగట్టా. ఇందులో ఒక కీలకపాత్ర విశ్రాంతి ముందు రివీల్ అవుతుంది. గతంలో బోయపాటి-బాలయ్య సినిమాల్లో కూడా ఇలాగే జరిగింది.
ఇంతకీ ఆ రెండో పాత్ర ఏమిటంటే, అఘోరాగా బాలయ్య కనిపిస్తారని తెలుస్తోంది. ఓ బాలయ్య పాత్రను చిన్నప్పటి నుంచే అఘోరాలు కాశీలో పెంచి పెద్ద చేస్తారని గ్యాసిప్ వినిపిస్తోంది. ఆ పాత్ర విశ్రాంతి ముందు రివీల్ అవుతుందని, ఆ పాత్ర కోసమే బాలయ్య రెడీ అవుతున్నారని, ఆ పాత్ర షూట్ నే ముందుగా వుంటుందని తెలుస్తోంది.
బాలయ్య-బోయపాటి సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారు. మణిశర్మ సంగీత దర్శకుడు.