కోటి ట్యూన్స్ కాపీ కొట్టి క్రేజ్ తెచ్చుకున్న రెహ్మాన్

రెహ్మాన్ నా శిష్యుడు, నా దగ్గర పనిచేశాడంటూ చెప్పుకునే సంగీత దర్శకుడు కోటి.. ఇప్పుడు అదే రెహ్మాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెహ్మాన్ కొత్తగా ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేయలేదని, తన దగ్గర…

రెహ్మాన్ నా శిష్యుడు, నా దగ్గర పనిచేశాడంటూ చెప్పుకునే సంగీత దర్శకుడు కోటి.. ఇప్పుడు అదే రెహ్మాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెహ్మాన్ కొత్తగా ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేయలేదని, తన దగ్గర నేర్చుకున్న ట్యూన్స్ నే కాస్త అటుఇటు మార్చి పేరు తెచ్చుకున్నాడనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు.

“రెహ్మాన్ నా దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నాడు. అతడు కష్టపడ్డాడు ఓకే. కానీ అతడు సృష్టించిన ట్రెండ్ అంతా మేం చేసిందే. రెహ్మాన్ ను ఇక్కడ కూర్చోబెట్టి మరీ నేను ఈ మాట చెప్పగలను. రెహ్మాన్ పాటల్లో స్టయిల్ అంతా మాదే. రెహ్మాన్ క్రియేట్ చేసిన ట్రెండ్ మాదే.”

ఇలా రెహ్మాన్ ట్రెండ్ ను తన ట్రెండ్ గా చెప్పుకొచ్చారు కోటి. అప్పట్లో తను ఓ ఆల్బమ్ చేస్తే, ఆ ఆల్బమ్ ఇన్స్పిరేషన్ తో రెహ్మాన్ చాలా పాటలకు బాణీలు కట్టాడని అంటున్నారు కోటి.

“రోజా సినిమాలో నా చెలి రోజావే అనే పాటను రెహ్మాన్ కంపోజ్ చేసి చాలా పేరు తెచ్చుకున్నాడు. నిజమే కానీ ఆ స్టయిల్ మాదే. ఆ బీట్ తో మేం (రాజ్-కోటి) ఎప్పుడో చేశాం. మేం అప్పట్లో చేసిన ఓ ఆల్బమ్ సెన్సేషనల్ హిట్టయింది. మేం చేసిన ఆల్బమ్ స్ఫూర్తితో  రెహ్మాన్ ఎన్నో పాటలు చేశాడు.”

ఆస్కార్ అవార్డ్ అందుకున్న రెహ్మాన్ సంగీతంపై ఇలా ఉన్నఫలంగా విమర్శలు గుప్పించారు కోటి. మరోవైపు తనకు పెద్ద సినిమాల అవకాశాలు ఎందుకు రావట్లేదనే అంశంపై కూడా కోటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

“నేను అప్ డేట్ అవ్వాలేమో.. నా మ్యూజిక్ కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. లేదంటే ఏదైనా గ్రూపిజం ఉందేమో.. నా అవకాశాల్ని వేరే వాళ్లు ఎత్తుకుపోతున్నారేమో. ఎందుకంటే ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. కారణం ఏదైనా నాకు పెద్ద సినిమా ఆఫర్లు రావడం లేదు. త్రివిక్రమ్ సినిమాలకు కూడా గతంలో మంచి మ్యూజిక్ ఇచ్చాను. మళ్లీ అతడు నన్ను అడగలేదు. నేను అడగలేను, అది అతడికుండాలి.”

మొత్తమ్మీద తనకు అవకాశాలు రావడం లేదనే ఫ్రస్ట్రేషన్, తన శిష్యులకు ఎక్కువ క్రేజ్ వచ్చేస్తోందనే ఆక్రోషం కోటిలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరులో కోటి ఉంది కానీ ఇప్పటివరకు తను కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకోలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి.

బుద్ది లేని రాతలు