‘ష‌కీలా’ రెండోవైపు చూడాల‌ని ఉందా…

చిత్ర‌రంగంలో ఒక్కో న‌టి పేరు చెబితే ఒక్కో ర‌కమైన ముద్ర‌లుంటాయి. ఆయా న‌టులు తాము పోషించే పాత్ర‌లు వారికి ఆ ర‌క‌మైన పేరు తీసుకొస్తుంటాయి. న‌టి ష‌కీలా పేరు చెబితే చాలు…కుర్ర‌కారుకు మ‌త్తెక్కుతుంది. ఎప్పుడెప్పుడూ…

చిత్ర‌రంగంలో ఒక్కో న‌టి పేరు చెబితే ఒక్కో ర‌కమైన ముద్ర‌లుంటాయి. ఆయా న‌టులు తాము పోషించే పాత్ర‌లు వారికి ఆ ర‌క‌మైన పేరు తీసుకొస్తుంటాయి. న‌టి ష‌కీలా పేరు చెబితే చాలు…కుర్ర‌కారుకు మ‌త్తెక్కుతుంది. ఎప్పుడెప్పుడూ ఆమె సినిమాలు చూద్దామా అని మ‌న‌సు ఉవ్విళ్లూరుతుంది. ష‌కీలా క‌ళ్ల‌లో రెచ్చ‌గొట్టె చూపు, త‌న్మ‌య‌త్వంలో ముంచే క‌వ్వింత‌లు, యువ‌త‌ను చొంగ కార్చుకునేలా ఆమె వేష‌ధార‌ణ‌.

మంచీచెడు ప‌క్క‌న పెడితే…ష‌కీలా అంటే రొటీన్ సినిమాల‌కు భిన్న‌మైన సినిమాల‌నే అనే ‘ముద్ర’ బ‌లంగా ఉంది. అది నిజం కూడా. ఎందుక‌నో గానీ, ఆ ‘బ్రాండ్’ నుంచి ష‌కీలా బ‌య‌ట‌ప‌డాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. తాను కేవ‌లం ఆ ‘టైప్’ సినిమాలే కాదు, అన్ని ర‌కాల సినిమాలు చేస్తాన‌ని నిరూపించుకునేందుకు కుటుంబ క‌థా చిత్రంతో ముందుకు వ‌స్తున్నారామె. న‌ట‌న‌లో తాను రెండోవైపు కూడా చూపాల‌నుకుంటున్నారామె.

ష‌కీలా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఆ చిత్రం ‘ష‌కీలా రాసిన మొట్ట మొద‌టి కుటుంబ క‌థా చిత్రం’. ఈ పేరే ష‌కీలా జీవిత‌మంత ఉంద‌ని అభిమానులు సెటైర్లు విసురుతున్నారు. ఈ సినిమాలో విక్ర‌మ్‌, ప‌ల్ల‌వి ఘోష్ జంట‌గా న‌టించారు. స‌తీష్ వీఎస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ష‌కీలా మాట్లాడుతూ తాను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ ఇప్ప‌టికీ సెన్సార్‌కు నోచుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎంతో అస‌భ్య‌త‌తో కూడిన చిత్రాలు కూడా విడుద‌ల‌య్యాయ‌ని ఆమె ఆరోపించారు. ష‌కీలా నిర్మాత అంటేనే సెన్సార్ పూర్తి కాలేద‌న్నారు. ఇక తాను రాసిన క‌థ అంటే సెన్సార్ వాళ్లు ఇంకెన్ని ఇబ్బందులు పెడ‌తారోన‌ని ఆమె వాపోయారు. కానీ ఇది ప‌క్కా కుటుంబ క‌థా చిత్ర‌మ‌ని ఆమె చెప్పుకొచ్చారు.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం