పోలవరం వద్ద వాజ్ పేయ్ విగ్రహం?

అటల్ బిహారీ వాజ్ పేయ్. భారత రత్నం. వివాదాలకు తావు లేని మచ్చలేని రాజకీయ నేత. ఆయన అంటే అందరికీ అభిమానమే. అటువంటి వాజ్ పేయిని వివాదాల్లోకి తేవాలని బీజేపీ భావిస్తోందా. Advertisement ఏమో…

అటల్ బిహారీ వాజ్ పేయ్. భారత రత్నం. వివాదాలకు తావు లేని మచ్చలేని రాజకీయ నేత. ఆయన అంటే అందరికీ అభిమానమే. అటువంటి వాజ్ పేయిని వివాదాల్లోకి తేవాలని బీజేపీ భావిస్తోందా.

ఏమో దివంగతుడైన వాజ్ పేయ్ ని తెచ్చి రాజకీయ‌ రచ్చ చేయాలని కమలనాధులు చూస్తున్నట్లుగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అన్న మాట ఇపుడు వినిపిస్తోంది అంటే దానికి కారకుడు వైఎస్సార్ అని అంతా అంటారు. ప్రత్యర్ధులు కూడా ఒప్పుకుంటారు.

అటువంటి వైఎస్సార్ విగ్రహాన్ని పోలవరం వద్ద వైసీపీ సర్కార్ పెడుతోంది అని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శల ద్వారానే తెలుస్తోంది. అది అవునో కాదో కానీ బీజేపీ ఇపుడు మాకూ ఒక విగ్రహం కావాలంటూ రాజకీయం రక్తి కట్టిస్తోంది.

బీజేపీకి శిఖరాయమానుడైన వాజ్ పేయ్ విగ్రహాన్ని పోలవరం ప్రాజెక్ట్ వద్ద పెట్టాలని తాజాగా సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. మీరు పెడతారా మేము పెట్టుకోమంటారా అని కూడా ఆయన నిగ్గదీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాదంటే కేంద్ర నిధులతో వాజ్ పేయ్ విగ్రహాన్ని పోలవరం వద్ద ప్రతిష్టిస్తారట.

ఇదంతా ఎందుకు పోలవరానికి పూర్తి స్థాయి నిధులు ఇచ్చి తొందరగా పూర్తి అయ్యేలా చేస్తే అపుడు విగ్రహాలతో పని లేకుండా బీజేపీనే జనం ఆదరిస్తారుగా. మరి షార్ట్ కట్ రూట్స్ ఎందుకో కమలనాధులకు. మొత్తానికి చనిపోయిన పెద్ద మనిషి వాజ్ పేయ్ ని ఇపుడు పోలవరంతో ముడిపెట్టేయడమే అసలైన పొలిటికల్ ట్రాజెడీ.

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు