చంద్రబాబుని వదలని 23 నంబర్…!?

పిల్లనిచ్చిన మామ ఎన్టీయార్  నుంచి అధికారం లాగేసుకున్న వేళ చంద్రబాబు అచ్చంగా 23 జిల్లాలకు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో చక్రం తిప్పిన రాజకీయ చాణక్యుడు. ఢిల్లీ టూ హైదరాబాద్ స్పెషల్  ఫ్లైట్ వేసుకుని…

పిల్లనిచ్చిన మామ ఎన్టీయార్  నుంచి అధికారం లాగేసుకున్న వేళ చంద్రబాబు అచ్చంగా 23 జిల్లాలకు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో చక్రం తిప్పిన రాజకీయ చాణక్యుడు. ఢిల్లీ టూ హైదరాబాద్ స్పెషల్  ఫ్లైట్ వేసుకుని మరీ బిజీ బిజీ  రాజకీయాలు చేసిన బడా లీడర్.

అదే బాబు 2014కి వచ్చేసరికి 13 జిల్లాల విభజన ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2019 నాటికి మళ్ళీ ఆయనకు 23 మంది ఎమంల్యేలు దక్కారు. సీటూ పోయింది. ఆ తీర్పు కూడా మే నెల  23వ తేదీన రావడం విశేషం. 

దీనికంటే ముందు  బాబు సీఎంగా ఉండగా  23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాగేసుకున్నారు. దాంతో ఆయన పార్టీకి అదే నంబర్ దక్కిందని కూడా అధికార వైసీపీ సెటైర్లు వేసింది.

ఇక శాసనమండలిలో మందబలం మాదేనని జబ్బలు చరచుకున్న టీడీపీకి జనవరి 23వ తేదీ తలరాతను మార్చేసింది. అదే రోజు ఈ మండలి మనకెందుకు అంటూ ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులంతా ఒక్క లెక్కన దాని సంగతి తేల్చేశారు. ఇక 27న మండలి రద్దు తీర్మానం లాంఛ‌నమే.

వీటన్నిటికీ కారణమైన మూడు రాజధానుల కధలో బాబు కాస్తా పదమూడు జిల్లాల నేత నుంచి మూడు గ్రామాల నాయకుడిగా తగ్గిపోయారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమరనాధ్ అంటున్నారు. 

మొత్తానికి బాబుకు 23 నంబర్ కి ఏదో బంధం ఉందని, అందుకే ఆయన్ని, మూడు, పదమూడు, 23 అని పిలవాల్సిఉంటుందని  గుడివాడ వేసిన పంచులు చూస్తే తమ్ముళ్ళేమంటారో.

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా

మా తార‌క్ బావ‌కి ధ్యాంక్స్ చెప్పుకుంటా