పొడిపొడి ఆన్సర్లు.. చిటికెలో పని పూర్తిచేసిన హీరో

కొన్ని ఇంటర్వ్యూలు భలే ఆసక్తికరంగా సాగుతాయి. యాంకర్ ఒకటి అడిగితే, తారలు ఒకటికి రెండు చెబుతారు. ఏదో అడిగితే ఇంకేదో చెప్పే తారలు కూడా ఉన్నారు. అయితే రవితేజ మూడో టైపు. అడిగిందే చిన్న…

కొన్ని ఇంటర్వ్యూలు భలే ఆసక్తికరంగా సాగుతాయి. యాంకర్ ఒకటి అడిగితే, తారలు ఒకటికి రెండు చెబుతారు. ఏదో అడిగితే ఇంకేదో చెప్పే తారలు కూడా ఉన్నారు. అయితే రవితేజ మూడో టైపు. అడిగిందే చిన్న ప్రశ్న, దానికి అంతే చిన్నగా, పొడిపొడిగా సమాధానాలు చెబుతాడు రవితేజ.

గ్రేట్ యాక్టర్, ప్లాన్ చేద్దాం, వెరీ సూన్, మై ఎనర్జీ, నా ఫేవరెట్ సాంగ్, దద్దరిల్లిపోద్ది… ఇవన్నీ ఏంటో తెలుసా..? చాంతాడంతా ప్రశ్నకు రవితేజ ఇచ్చిన సమాధానాలు. ఇలా పొడిపొడిగా సమాధానాలిచ్చి 40 నిమిషాల్లో ఇంటర్వ్యూ పూర్తిచేశాడు రవితేజ. అది కూడా ఆన్ లైన్ ట్విట్టర్ ఛాట్ లో.

రావణాసుర రిలీజ్ కు రెడీ అయింది. ఎప్పుడు తన సినిమా రిలీజ్ కు సిద్ధమైనా ఇలా ట్విట్టర్ లో ఛాటింగ్ పెట్టడం రవితేజకు అలవాటు. అయితే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం తలపెట్టినా రవితేజ సమాధానాలు ఇలానే ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు సింగిల్ పదం లేదా 2-3 పదాలతోనే ఆయన సమాధానం పూర్తిచేస్తాడు.

కేవలం ట్విట్టర్ లోనే ఆయనిలా రెస్పాండ్ అవుతారనుకుంటే పొరపాటే. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూల్లో కూడా రవితేజ స్టయిల్ ఇదే. మాట కంటే హావభావాలతోనే ఎక్కువ మాట్లాడేస్తాడు. యాంకర్ ప్రశ్న పూర్తవ్వకముందే తన పొడి సమాధానాలతో దాన్ని పూర్తి చేస్తాడు. అది ఆయన స్టయిల్ అంతే.