రావణాసుర..ఓ సర్ప్రయిజ్ ప్యాకేజ్

రవితేజ నటించిన థ్రిల్లర్..రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈవారం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ మీడియాతో మాట్లాడారు. Advertisement రావణాసుర కథ…

రవితేజ నటించిన థ్రిల్లర్..రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈవారం విడుదలకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ మీడియాతో మాట్లాడారు.

రావణాసుర కథ ఏమిటి?

‘రావణాసుర’ సూపర్ ఎక్సయిటెడ్ గా వుంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివిల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ వుండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే దానిని హోల్డ్ చేస్తున్నాం. 

రవితేజ ఇలాంటి సినిమా ఆలోచన?

రవితేజకి ఫలానా జానర్ సినిమా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదు. అయితే శ్రీకాంత్ కథ చెప్పిన్నపుడు రవితేజకి నచ్చి, నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు ఎక్సయిటింగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయిటెడ్ గా అనిపించింది. రావణాసుర వంద శాతం కొత్త జానర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం.

హ్యాపీ ఎండింగ్..పాజిటివ్ షేడ్ అన్నది వుంటుందా?.. తెలుగు సినిమాల్లో ఒక హ్యాపీ ఎండింగ్, హీరో పాజిటివ్ షెడ్ వుంటుంది కదా.. కానీ ఇందులో మీరు ఫ్లిప్ చేసినట్లుగా వున్నారు

మీరు అన్నట్టుగా ఆ ఫ్లిప్ ఏమిటనేది మీరు వంద శాతం తృప్తి పడతారు. సినిమా చూసిన తర్వాత మన సెన్సిబిలిటీస్ మిస్ అయిన ఫీలింగ్ మీకు రాదని నా నమ్మకం.

గత రెండేళ్ళుగా హీరోలని గ్రే షేడ్స్ లో చూపించడం ట్రెండ్ గా మారింది కదా ?

షేడ్స్ అనేది చాలా కాలంగా వుంది. అంతంలో నాగార్జున, సత్యలో జేడీ ఇవన్నీ గ్రేనే కదా. ఇవి ఎప్పటి నుంచో వున్నాయి. అయితే ఈ మద్య అవి ఎక్కువగా పెరిగాయి.

ఇందులో చాలా మంది నటీనటులు వున్నారు కదా. ?

కథలో ఇంతమంది వున్నారు .. ఏం చేస్తారు? అనే క్యురియాసిటీనే కావాలి . చూసినపుడు మీకు అర్ధమౌతుంది. ప్రతి పాత్ర కీలకంగా కథలో భాగంగా వుంటుంది.  సర్ ప్రైజ్, షాక్, థ్రిల్లు ఈ మూడు ఎలిమెంట్స్ తో అలరించే చిత్రమిది.

రావణాసుర కి సీక్వెల్ ఛాన్స్ ఉందా ?

ఈ కథకి ఒక ముగింపు వుంటుంది. అయితే సీక్వెల్ చేయాలని అనుకున్నపుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే అవకాశం కూడా వుంది.

మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చేయడానికి కారణం ?

నాకు క్రైమ్ జానర్ మీద సినిమా రన్ చేయడం ఇష్టం. నాకు హోల్డింగ్ పాయింట్ కావాలి. తర్వాత ఏం జరుగుతుందని ఆడియన్ ఆసక్తిగా ఎదురుచూసేలా చేయడం నాకు బాగా ఇష్టం.

థ్రిల్లర్స్ కి యునివర్షల్ రీచ్ వుంటుంది కదా.. రావణాసురని అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన రాలేదా ?

ముందు అనుకున్నాం. హిందీ, తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీ ప్లాన్ చేస్తున్నాం.