రావణాసుర సీక్రెట్ అదే

టోటల్ వరల్డ్ వైడ్ గా రావణాసుర సినిమా ఓన్ రిలీజ్ అవుతోంది. నిర్మాత అభిషేక్ నామా స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సిన్మా విడుదల ముందు నిర్మాతలు హాపీగా వుండడం అన్నది అరుదు.…

టోటల్ వరల్డ్ వైడ్ గా రావణాసుర సినిమా ఓన్ రిలీజ్ అవుతోంది. నిర్మాత అభిషేక్ నామా స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సిన్మా విడుదల ముందు నిర్మాతలు హాపీగా వుండడం అన్నది అరుదు. పైగా స్వంతంగా విడుదల చేసుకుంటూ. 

ఎందుకంటే థియేటర్ కు జనం ఏ సినిమాకు వస్తారో..ఏ సినిమాకు రారో తెలియడం లేదు. వచ్చినా ఫస్ట్ వీకెండ్ తరువాత ఎలా వుంటుందో తెలియదు. ఇలాంటి టైమ్ లో థియేటర్ మీద బర్డెన్ ఎంత తక్కువ వుంటే అంత మంచిది. 

కానీ రావణాసుర సినిమాకు విడుదలకు ముందే ఫుల్ హ్యాపీగా వున్నారు నిర్మాతలు అభిషేక్ నామా..రవితేజ ఇద్దరూ. దీని వెనుక సీక్రెట్ ఏమీ లేదు. హీరో రవితేజ కూడా సినిమాలో నిర్మాణ భాగస్వామి కావడమే. సినిమాకు నాన్ థియేటర్ ఆదాయం 43 కోట్ల మేరకు వచ్చింది. హీరో రెమ్యూనిరేషన్ లేదు కనుక ఆ డబ్బుల్లోనే ప్రొడక్షన్ చేసేసారు. ఇక ఇప్పుడు థియేటర్ల మీద ఎంత వస్తే అందులోంచి రవితేజ, అభిషేక్ నామా వాళ్లు ముందు అనుకున్న ఈక్వేషన్ ల ప్రకారం షేర్ చేసుకుంటారు. 

సినిమా మంచి హిట్ అయితే రవితేజ రెమ్యూనిరేషన్ మేరకు ఆదాయం వస్తుంది. నాన్ థియేటర్ లో ఏదైనా మిగిలితే అది లాభం అవుతుంది. నిజానికి ఓ రేంజ్ వరకు హీరోలు ఇలా భాగస్వామ్యం మీద సినిమా చేస్తే నిర్మాతలు హ్యాపీగా వుంటారు.