అగ్రనటుల సమక్షంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ….వైఫ్‌గా ప్రమోషన్ పొందారు. ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎలాంటి ఆడంబరాలు, ప్రచారం లేకుండా అత్యంత రహస్యంగా ఆమె వివాహం జరిగింది. ఇదేంటని ఆశ్చర్యానికి గురవుతున్నారా? మరేం టెన్షన్ పడకండి. కుర్రకారు మనసు ఏదోలా అయిపోనవసరం లేదు. ఓ యాడ్‌కు సంబంధించి నాగార్జున, అమితాబ్ దంపతులు తదితర ప్రముఖ నటుల సమక్షంలో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
కత్రినా కైప్ ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్‌కుమార్ ప్రచారకర్తలు. వీరితో పాటు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ , ఆయన భార్య జయాబచ్చన్ కూడా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ దుకాణానికి సంబంధించి సృజనాత్మకంగా కొత్త యాడ్‌ను చిత్రీకరించారు. యాడ్‌లో భాగంగా కత్రినా కైఫ్ పెళ్లి కూతురిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. కాగా కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్ దంపతులు, ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ నటించారు. ఈ యాడ్‌కు సంబంధించి ఫొటోలను అమితాబ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
కాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అగ్ర నటుల కుమారులైన ప్రముఖ నటులు….తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, తమిళ్‌లో శివాజీగణేషన్ కుమారుడు ప్రభు, కన్నడ పరిశ్రమలో రాజ్‌కుమార్ కుమారుడు శివరాజ్‌కుమార్‌తో నటించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అమితాబ్ పేర్కొన్నారు.
ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు