శర్వాతో మరోసారి సమంత

96 రీమేక్ తో శర్వానంద్-సమంత కాంబినేషన్ సాధ్యమైంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను మరోసారి చూపించడానికి సిద్దం అవుతున్నారు డైరక్టర్ అజయ్ భూపతి. ఆయన తన మహాసముద్రం ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్ మెంట్స్…

96 రీమేక్ తో శర్వానంద్-సమంత కాంబినేషన్ సాధ్యమైంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను మరోసారి చూపించడానికి సిద్దం అవుతున్నారు డైరక్టర్ అజయ్ భూపతి. ఆయన తన మహాసముద్రం ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నారు. నాగ్ చైతన్య కోసం చూసి, చూసి, ఆఖరికి ఆ క్యాంప్ నుంచి బయటకు వచ్చారు.

నిజానికి ఆర్ఎక్స్ 100 తరవాత ఆ హీరో మూడు నాలుగు సినిమాలుచేసారు. కానీ అజయ్ భూపతి మరో సినిమా చేయకుండా చైతూ కోసం ఎదురుచూస్తూ గడిపేసారు. ఆఖరికి ఇప్పటికి శర్వానంద్ తో సెట్ అయింది. అయితే చైతూకి కథ చెప్పినపుడే సమంతకు కూడా చెప్పారు. ఆ ఇద్దరి కాంబినేషన్ తోనే చేయాలనుకున్నారు. 

అందుకే ఇప్పుడు సమంతనే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. సమంత కు కథ, పాత్ర అన్నీ తెలుసు కాబట్టి ఫార్మల్ గా ఓకె అనాల్సి వుంది. అయితే జాను తరువాత సమంత ఏ సినిమా ఇంకా ఒకె అనలేదు. ఒకవేళ దీనికి ఓకె అంటే, శర్వాతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసినట్లు అవుతుంది. ఒకటి రెండురోజుల్లో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని బోగట్టా. 

ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన అజయ్ భూపతి మహాసముద్రం సినిమాకు ఆర్జీవీ క్యాంప్ జనాలను కొంతమందిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్జీవీ ప్రాజెక్టులు ఏవీ లేవు కనుక, ఆ జనాలను మహా సముద్రం కు వాడుతున్నట్లు తెలుస్తోంది.

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి 

ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు