భ‌క్తి చాన‌ల్‌లో ర‌క్తి ధోర‌ణులు

హిందూ మ‌తం గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్‌ను వైఎస్సార్ హ‌యాంలో ప్రారంభించారు. అయితే కొంత మంది ఉద్యోగుల వికృత చేష్ట‌ల వ‌ల్ల ప‌విత్ర చాన‌ల్‌కు…

హిందూ మ‌తం గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్‌ను వైఎస్సార్ హ‌యాంలో ప్రారంభించారు. అయితే కొంత మంది ఉద్యోగుల వికృత చేష్ట‌ల వ‌ల్ల ప‌విత్ర చాన‌ల్‌కు మ‌చ్చ ఏర్ప‌డుతోంది.

వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత సినీ న‌టుడు పృథ్వీరాజ్‌ను ఆ చాన‌ల్ చైర్మ‌న్‌గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే లైంగిక ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న త‌న ప‌ద‌విని పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది.

అనంత‌రం ఎస్వీబీసీ చాన‌ల్ చైర్మ‌న్‌గా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి రాజా వారి కుటుంబానికి చెందిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి , మాజీ ఎమ్మెల్యే   డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను ప్ర‌భుత్వం నియ‌మించింది. 

ఈయ‌న నేతృత్వంలో ఎస్వీబీసీ చాన‌ల్ త‌న ఆశ‌యానికి త‌గ్గ‌ట్టు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌నే న‌మ్మ‌కం, విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చాన‌ల్‌లో ప‌ని చేసే కొంద‌రు ఉద్యోగుల విప‌రీత పోక‌డ‌లు తెర మీదకి వ‌చ్చాయి.

శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు చాన‌ల్‌కు మెయిల్ చేశాడు. దీనికి స‌మాధానంగా ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్ పంపాడు. దీంతో స‌ద‌రు భ‌క్తుడు తీవ్ర ఆగ్రహంతో టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై వాళ్లిద్ద‌రూ తీవ్రంగా స్పందించారు.

ఈ విష‌య‌మై నిజానిజాలు నిగ్గు తేల్చాల‌ని టీటీడీ విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. చైర్మ‌న్‌, ఈవో ఆదేశాల‌తో టీటీడీ విజిలెన్స్ , సైబ‌ర్ క్రైం అధికారులు రంగంలోకి దిగారు. ఎస్వీబీసీ కార్యాల‌యంలో టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైం అధికారులు తనిఖీలు నిర్వ‌హించారు. కార్యాల‌యంలో పోర్న్‌సైట్లు చూస్తున్న ఐదుగురు ఉద్యోగుల్ని సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ గుర్తించింది.

అలాగే విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని అధికారులు గుర్తించారు.  విధుల్లో నిర్ల‌క్ష్యం, టీటీడీతో పాటు భ‌క్తి చాన‌ల్‌కు చెడ్డ పేరు తెచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎస్వీబీసీ  ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నార‌ని స‌మాచారం. టీటీడీలో ఒక దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌రుస వివాదాల‌కు దారి తీస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ఈ విజయం భాజపా దా? రఘునందన్ దా?