ఉన్నట్లుండి ఫ్యాన్స్ ఉలిక్కి పడేలాంటి ప్రకటన చేసారు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య షూట్ ప్రారంభం సందర్భంగా ప్రోటోకాల్ లో భాగంగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా అని, పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. కానీ ఏ లక్షణాలు లేవని, అయినా సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయానని వెల్లడించారు.
అంతవరకు బాగానే వుంది. తనను గత వారం రోజులుగా కలిసిన వారు అంతా పరిక్ష చేయించుకోవాలని విన్నవించారు. ఇదే మరింత ఉలిక్కిపడేలా చేస్తోంది.
రెండు రోజుల కిందటే ఆయన నాగార్జున తో కలిసి వెళ్లి సిఎమ్ కెసిఆర్ ను, పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వచ్చారు.
ఇటీవలే ఓ పెళ్లికి హాజరయ్యారు మెగాస్టార్. అక్కడ సోకి వుంటుందని టాక్ వినిపిస్తోంది.
పైగా ఆ టైమ్ లో ఇటు నాగ్ కానీ, అటు చిరు కానీ మొహాన మాస్క్ లు లేకుండానే కనిపించారు. అయితే మెగాస్టార్ కు వచ్చింది ఏ లక్షణాలు లేని కోవిడ్ కాబట్టి, ఎవరికి ఏ సమస్య వుండదనే అనుకోవాలి.