అయ్యో..వెంకీ..లీకులే లీకులు

విక్టరీ వెంకటేష్ తన వెంకీ మామ తరువాత టేకప్ చేసిన సినిమా కు లీకుల బెడద తప్పడం లేదు. అసురన్ సినిమాకు రీమేక్ గా ఇది ప్రారంభించబోతున్నారు. ఆ విషయం, దానికి డైరక్టర్ గా…

విక్టరీ వెంకటేష్ తన వెంకీ మామ తరువాత టేకప్ చేసిన సినిమా కు లీకుల బెడద తప్పడం లేదు. అసురన్ సినిమాకు రీమేక్ గా ఇది ప్రారంభించబోతున్నారు. ఆ విషయం, దానికి డైరక్టర్ గా శ్రీకాంత్ అడ్డాల ఫిక్స్ అయిన సంగతి ముందే బయటకు వచ్చేసాయి. సరే అవి అంటే ఒకె. కానీ అసలు అసురన్ లో వెంకీ గెటప్ ఎలా వుండబోతోంది అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ కు వుంది. 

అందుకే షూటింగ్ ప్రారంభమయ్యే రోజు న లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అప్పుడే టైటిల్ కూడా అనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ దానికి రెండు రోజులు ముందుగానే నారప్ప అనే టైటిల్ బయటకు వచ్చేసింది. వ్యవహారం అక్కడితో ఆగలేదు. నిర్మాణ భాగస్వామి కలైపులి థాను భారీగా డైలీలకు ప్రకటనలు విడుదల చేసారు.

ఇందుకోసం అ యిదు డిజైన్లు చేయించారు. కానీ అవన్నీ ఇప్పుడు ముందుగానే బయటకు వచ్చేసాయి. భంగిమ వన్, టు అన్నట్లుగా వెంకీ గెటప్ లు అన్నీ ఇప్పుడు వాట్సప్ ల్లో, ట్విట్టర్ ల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుబురు గెడ్డం, మెలికలు తిరిగిన మీసం, తలకు తలపాగా, ముఖంపై గాట్లు, పైగా అడ్డ బొట్టు ఇలా రఫ్ ప్లస్ ఏజ్డ్ లుక్ తో వెంకీ కనిపిస్తున్నాడు.

ప్రయోగాలు చేయడం వెంకీకి అలవాటే. జనం రిసీస్ చేసుకున్నా చేసుకోకున్నా. ఇలా చేసిన సినిమాలు ఓకె అనిపించుకున్నాయి కానీ సూపర్ అనిపించుకోలేదు. మరి అసురన్ ఎలా వుంటుందో చూడాలి.

Click Here For Photo Gallery