అటు హారిక హాసిని, ఇటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ మీద వరుసగా భారీ, మీడియం సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న నిర్మాతలు చినబాబు,నాగవంశీ మరో క్రేజీ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ మీద నితిన్ తో రెండు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. వీటిలో ఒకటి భీష్మ. ఇది ఫిబ్రవరి 28న విడుదలకు రెడీ అవుతోంది. మరొకటి రంగ్ దే.
ఈ రెండూ కాకుండా మరో రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. వాటిలో ఒకటి ఆర్ఎక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతితో ఒకటి. దానికి ఇంకా స్టార్ కాస్ట్ అంతా ప్లాన్ చేయాలి. ఈలోగా హీరో నాని తో ఓ ప్రాజెక్టు ఫిక్స్ అయిపోయింది. గతంలో ది ఎండ్, టాక్సీ వాలా సినిమాలు అందించిన రాహుల్ దర్శకుడు. రాహుల్ చెప్పిన లైన్ ను నాని ఓకె చేసినట్లు బోగట్టా.
ప్రస్తుతం నాని చేస్తున్న వి సినిమా దాదాపు పూర్తయింది. టక్ జగదీష్ సినిమా సెట్ మీద వుంది. టక్ జగదీష్ పూర్తి కాగానే రాహుల్ రవీంద్రన్ సినిమా ప్రారంభమవుతుంది. దీనికి హీరోయిన్, ఇతరత్రా ఎంపికలపై డిస్కషన్లు సాగుతున్నాయి.