జేడీ అంటే అది ఆయన ఇంటిపేరు అయింది. సీబీఐ లో జేడీ హోదాలో పనిచేసిన లక్ష్మీనారాయణ ఆ తరువాత ప్రమోషన్ పైన మహారాష్ట్రకు వెళ్లారు. ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు.
జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి బాగానే ఓట్లు సంపాదించారు. ఇదిలా ఉంటే జేడీ వచ్చే ఎన్నికలకు అపుడే రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆయన పూర్తి విశాఖ వాసిగా మారిపోనున్నారు. మొత్తానికి తన రాజకీయ ఓటుని విశాఖనే వేశారు. తాను విశాఖ ఎంపీ కావాలన్నది ఆయన పట్టుదలగా ఉంది.
అయితే ఈసారి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం అసక్తికరమే. ఆయన వైసీపీ వైపు అసలు వెళ్లరు. ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. ఇక టీడీపీ వైపు వెళ్తే చంద్రబాబు మనిషిగా పేరు వస్తుందని ఆ సాహసం కూడా చేయరు అంటున్నారు.
ఆయన జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని విశాఖ నుంచి తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారుట. మరి అన్నీ అనుకూలిస్తే తొందరలోనే ఆయన మెడలో కాషాయ కండువా పడుతుంది అంటున్నారు.
అంతే కాదు, ఆయన మకాం కూడా విశాఖకు త్వరలోనే మార్చేస్తున్నారు అంటున్నారు. అంటే 2024లో విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఆయన్ని చూడబోతామన్న మాట.