తన కుటుంబ సభ్యులు, బంధువుల సమేతంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా పెళ్లి వేడుకల్లో ఉంది నటి కాజల్ అగర్వాల్. కొన్నాళ్లుగా తన పెళ్లి కి సంబంధించిన విషయాలను లీకులిచ్చిన కాజల్ ఆ తర్వాత అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. తనకు కొన్నేళ్లుగా తెలిసిన వ్యక్తినే కాజల్ భర్తగా చేసుకుంది. తమ పెళ్లి ముచ్చట్లను, తమ రిలేషన్ షిప్ గురించి ఇప్పుడామె పంచుకుంటోంది.
ఇక ఈ పెళ్లి వేడుకను కాజల్ చాలా రిచ్ గానే ప్లాన్ చేసుకున్నట్టుగా ఉంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంది. తన పెళ్లి వేడుకకు దుస్తులను డిజైన్ చేసే బాధ్యతను ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రాకే అప్పగించిందట ఈ నటీమణి. ఫొటోలను పోస్టు చేసే క్రమంలో ఆ డిజైన్లను మెచ్చుకుంటూ ఆ డిజైనర్ కు కృతజ్ఞతలు తెలిపింది.
అతడి టీమ్ తన కోసం చాలా కష్టపడిందని మెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆమె పెళ్లికి దుస్తులను డిజైన్ చేసిన డిజైనర్ ఆసక్తిదాయకమైన విషయాలను చెప్పాడు. తమ టీమ్ మొత్తం 25 రోజుల పాటు కష్టపడి కాజల్ పెళ్లి వేడుకకు దుస్తులు తయారు చేసిందట!
ఆమె దుస్తుల్లో ఆభరణాలు పొదిగి ఉండేలా డిజైన్ చేశారట. ఒక బ్లౌజ్ నైతే నెక్లెస్ కలిపి కుట్టారట! ఇలాంటి డిజైనింగ్ లకు భారీగా ఖర్చు అయి ఉంటుందనేది వేరే చెప్పనక్కర్లేని మాట.