ఆర్ఆర్ఆర్ సినిమాలో నేను లేను

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో రూమర్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో సుదీప్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని, కొమరం భీమ్ ను వెదికి పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో సుదీప్ కనిపిస్తాడంటూ కథనాలు…

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మరో రూమర్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో సుదీప్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని, కొమరం భీమ్ ను వెదికి పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో సుదీప్ కనిపిస్తాడంటూ కథనాలు వచ్చాయి. ఇక్కడితో ఆగకుండా 20 నుంచి సుదీప్ సెట్స్ పైకి వస్తాడంటూ కూడా గాసిప్స్ వదిలారు. వీటిపై సుదీప్ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు.

“ఆ సినిమా అంటే గౌరవంతో, పైగా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ చెబుతున్నాను. నాకు-ఆర్ఆర్ఆర్ కు సంబంధం లేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఎలాంటి చర్చ కూడా జరగలేదు.”

ఇలా ఆర్ఆర్ఆర్ పై పూర్తి స్పష్టత ఇచ్చాడు సుదీప్. మొన్నటివరకు ఈ సినిమాకు సంబంధించి అలియా భట్ పై పుకార్లు వచ్చాయి. ఆమె సెట్స్ పైకి వచ్చిందని, చరణ్ తో ఓ సాంగ్ షూట్ కూడా పూర్తయిందని అన్నారు. వీటిపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. అలాంటిదేం లేదని చెప్పేశాడు. ఇప్పుడు సుదీప్ కూడా తన పాత్ర లేదని చెప్పేయడంతో.. ఒకేసారి రెండు పెద్ద పుకార్లపై స్పష్టత వచ్చినట్టయింది.

గతంలో రాజమౌళి తీసిన ఈగ సినిమాలో నటించాడు సుదీప్. ఆ తర్వాత జక్కన్న తీసిన బాహుబలి సినిమాలో కూడా సుదీప్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో కూడా అతడు ఉన్నాడని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు సుదీప్.