త్రివిక్రమ్‌ని తిట్టుకుంటోన్న పవన్‌ ఫాన్స్‌

అల్లు అర్జున్‌తో మరోసారి డీసెంట్‌ సినిమా అందించిన త్రివిక్రమ్‌కి ఈసారి తమన్‌ అందించిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌ తోడవడంతో పాటు సంక్రాంతి కూడా కలిసి రావడంతో తన కెరీర్‌లో, అల్లు అర్జున్‌ కెరీర్‌లో అతి పెద్ద…

అల్లు అర్జున్‌తో మరోసారి డీసెంట్‌ సినిమా అందించిన త్రివిక్రమ్‌కి ఈసారి తమన్‌ అందించిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌ తోడవడంతో పాటు సంక్రాంతి కూడా కలిసి రావడంతో తన కెరీర్‌లో, అల్లు అర్జున్‌ కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని 'అల వైకుంఠపురములో'తో అందుకున్నాడు. అల్లు అర్జున్‌తో ఎప్పుడు చేసినా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునే త్రివిక్రమ్‌ 'అజ్ఞాతవాసి' విషయంలో మాత్రం పవన్‌ అభిమానులని మోసం చేసాడు.

పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లే ముందు త్రివిక్రమ్‌ తీసిన ఆ అతి దారుణమయిన చిత్రం అభిమానులని క్షోభకి గురి చేసింది. అరవింద సమేతకి, అల వైకుంఠపురానికి చూపించిన జాగ్రత్త అప్పుడేమయిందంటూ ఫాన్స్‌ చిరుబుర్రులాడుతున్నారు. దీనికి తోడు 'పింక్‌' రీమేక్‌ చేయాలని పవన్‌ని ప్రోత్సహించింది తానేనని త్రివిక్రమ్‌ ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పాడు. పవన్‌ ఇమేజ్‌కి ఏమాత్రం సూట్‌ అవని ఆ చిత్రాన్ని చేయమంటూ పవన్‌ని ప్రోత్సహించడం ఏమిటని, పవన్‌తో అత్యంత సన్నిహితంగా వుంటూ అతడి ఇమేజ్‌ని స్టడీ చేసింది ఇదేనా అంటూ ఫాన్స్‌ తిట్టుకుంటున్నారు.

ఒకవైపు అల్లు అర్జున్‌కి కూడా భారీ హిట్‌ ఇచ్చాడనే ఆనందం వున్నా కానీ పవన్‌ కళ్యాణ్‌ విషయంలో చాలా తప్పులు చేస్తున్నాడంటూ 'గురూజీ'పై సోషల్‌ మీడియాలో పలువురు కారాలు మిరియాలు నూరుతున్నారు. పింక్‌ రీమేక్‌కి సహ నిర్మాతగా వ్యవహరించాలని మొదట్లో భావించినా కానీ ఆ తర్వాత త్రివిక్రమ్‌ పక్కకి తప్పుకున్నాడు.