లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది జులై 30న థియేటర్లలోకి రావాలి. కానీ ఆ తేదీకి సినిమా రాదంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటికి మరింత ఊతమిస్తూ ఓ ట్వీట్ వచ్చింది. ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ఈ ట్వీట్ వేశాడు.
“ఎక్స్ క్లూజివ్ – ఈ పెద్ద సినిమా ఏంటో గెస్ చేయండి. సౌతిండియాకు చెందిన బ్లాక్ బస్టర్ డైరక్టర్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇప్పుడీ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ బడా మూవీ అక్టోబర్ 2020న రాబోతోంది.”
తరణ్ పెట్టిన ఈ ట్వీట్ తో అంతా ఎలర్ట్ అయ్యారు. కేవలం ఆర్ఆర్ఆర్ ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే అతడు ఈ ట్వీట్ చేశారని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే సౌత్ నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరక్టర్ అంటే చాలామందికి తెలిసింది రాజమౌళి మాత్రమే. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ కాకపోతే కరణ్ ఇలాంటి ట్వీట్ చేయడు కూడా.
ఇక రామ్ చరణ్ స్టేట్ మెంట్ కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. తన సరసన నటించాల్సిన అలియాభట్ ఇంకా సెట్స్ పైకి రాలేదంటూ బాంబ్ పేల్చాడు రామ్ చరణ్. ఆమె షూటింగ్ లో జాయిన్ అయిందని, తామిద్దరి మధ్య ఓ సాంగ్ షూట్ కూడా జరిగిందంటూ వచ్చిన వార్తల్ని ఖండించాడు. సో.. తరణ్ ట్వీట్, చరణ్ స్టేట్ మెంట్ కలిపి చూసుకుంటే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.