మే 23న పవన్ సినిమా రిలీజ్

ఒకపక్క జనసేన పార్టీ-భాజపా కలయికకు బీజం పడింది. అదే సమయంలో పవన్-దిల్ రాజు సినిమా విడుదలకు కూడా ముహుర్తం ఫిక్స్ అయిపోయినట్లు బోగట్టా. రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న పింక్…

ఒకపక్క జనసేన పార్టీ-భాజపా కలయికకు బీజం పడింది. అదే సమయంలో పవన్-దిల్ రాజు సినిమా విడుదలకు కూడా ముహుర్తం ఫిక్స్ అయిపోయినట్లు బోగట్టా. రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న పింక్ రీమేక్ ను విడుదల చేయడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. 

ఈ నెల 20 నుంచి పింక్ రీమేక్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే నెల నుంచి పవన్ షూటింగ్ కు వస్తారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలిస్తే పూజా హెగ్డే పవన్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. సినిమాలో ఒక డ్యూయట్ , రెండు ఫైట్లు కూడా వుంటాయి. 

ఇప్పటికే నివేదా థామస్, అంజలి, అనన్య మూడు కీలక క్యారెక్టర్లకు ఎంపికయ్యారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు ఈసినిమాను నిర్మించబోతున్నారు. సమ్మర్ లో పవన్ సినిమా విడుదల ఫిక్స్ అయిపోయినట్లే, దీన్ని బట్టి మిగిలిన సినిమాల డేట్ లు అటు ఇటు సర్దుకుంటాయి.